Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తన లవర్ అంటే ఎంత ఇష్టమో ఈమె మరోసారి ప్రూవ్ చేసింది? తన ప్రియుడు బాధలో ఉన్నాడని తెలుసుకున్న ఈ ముద్దుగుమ్మ అతడున్న చోటికి వాలిపోయి .. ప్రియుడికి ఓదార్పుగా నిలిచింది. ఈ కథ అంతా ఎక్కడో సినిమాల్లో జరిగింది కాదు .. రియల్ లైఫ్ లో జరిగిన లేటెస్ట్ కథ .. !! ఆ వివరాల్లోకి వెళితే .. బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క ప్రేమ కహాని గురించి తెలిసిందే. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ తో జోరు ప్రేమాయణంలో ఉన్న ఈ భామ తన ప్రియుడు ఐపీఎల్ మ్యాచ్ లు ఆడుతున్నాడు. బెంగుళూరు జట్టుకు నేతృత్వం వహిస్తున్న కోహ్లీ భుజానికి సంబందించిన గాయంతో బాధ పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అనుష్క ..తట్టుకోలేక వెంటనే కోహ్లీ ఉన్న చోటికి పరుగెత్తుకొచ్చిందట !! తన లవర్ కు కొత్త ఉత్సహాన్ని అందివ్వాలని .. అలాగే అతగాడు ఆడుతున్న మ్యాచ్ కోసం స్టేడియం లో కూడా చేస్తూ చీర్ అప్ తెలపాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది? గతంలో కూడా అనుష్క , కోహ్లీ ఆడిన చాల మ్యాచ్ లకు వచ్చి స్టేడియం లో చీర్ అప్ తెలిపింది. ఆ మధ్య కోహ్లీ .. అనుష్క మాయలో పడి మ్యాచ్ లు సరిగ్గా ఆడడం లేదని విమర్శలు వచ్చాయి .. ఈ విమర్శలపై ఘాటుగానే స్పందించాడు విరాట్. మొత్తానికి ఈ ప్రేమజంట విషయం మాత్రం బాలీవుడ్ లో వైరల్ అవుతుంది!!