Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తెలుగులో తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ రెజినా కాసాండ్రా కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి ..కానీ ఈ మధ్య వరుస పరాజయాలు ఆమెలో తీవ్ర నిరాశనే మిగిల్చాయి. అటు స్టార్ హీరోల సరసన మాత్రం ఛాన్స్ దక్కించుకోలేక పోయింది. స్టార్ హీరోల్లో ఒక్క రవితేజ సరసన మాత్రమే నటించిన ఈ భామ ప్రస్తుతం కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న నక్షత్రం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో రెజినా మంచి క్రేజ్ వస్తుందని ఆశ పడింది .. కానీ నక్షత్రం సినిమా ఇంకా విడుదల కాకుండా పోవడంతో నిరాశలో పడింది .. పోనీ అటు తమిళంలో నటిస్తున్న నెంజమ్ మరపతిలై సినిమా చేసింది. క్రేజీ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో సినిమా కాబట్టి తమిళంలో కూడా క్రేజ్ తెచ్చుకోవచ్చు అని ఆశపడ్డ ఈ భామకు ఆ సినిమా కూడా విడుదల వాయిదా పడడంతో నిరాశే మిగిల్చింది. సరైన సక్సెస్ తో కెరీర్ ని సాగించాలని అనుకున్న రెజినా ఆశలు నెరవేరేనా మరి ?