Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గారపడుతున్నా కొద్దీ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు స్వయానా తనయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మధ్య విబేధాలు నెలకొని పార్టీలో ముసలం ముదిరిన విషయం అందరికీ విదితమే. అయితే దీని ఫలితంగా సమాజ్ వాది పార్టీ రెండు భాగాలుగా విడిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్న సందర్భంలో ఒక సరి కొత్త అంకానికి తెరలేపారు అఖిలేష్ యాదవ్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తో పొత్తుకు అఖిలేష్ సమాలోచానలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ వర్గం తన బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌ వర్గాన్ని కాదని, లేదా కాలదన్ని స్వతంత్య్రంగా పోటీ చేయాల్సి వస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకుంటారన్న విషయంలో అప్పుడే చర్చ మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అకిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కలిస్తే బీహార్ తరహాలో అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుందని ఇరు వర్గాలు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.