Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

గ‌త కొంత‌కాలంగా విస్త్ర‌తంగా చ‌ర్చించుకుంటున్న అంశం రాష్ట్ర‌పతి ఎంపిక‌. ఆ ప‌ద‌వికి స‌రిప‌డే ప‌ర్స‌నాలిటీ, ఫిగ‌రు ఎవ‌రు? అని ఆరాలు కొన‌సాగుతున్నాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈ విష‌యంపై ఫ‌లానా క్యాండెట్ అయితే బావుంటుంది అని మాత్రం చెప్ప‌లేదు. ఒక‌వేళ ఆ పోస్టుకు ఆంధ్రా నుంచి కేంద్ర మంత్రిగా ఎం.వెంక‌య్య నాయుడు పోటీ ప‌డే ఛాన్సుందేమో! అన్న టాక్ కూడా వినిపించింది.

కానీ వెంక‌య్య‌కు ఆ అవ‌కాశం లేద‌న్న‌ది తాజా అప్‌డేట్‌. ఎందుకంటే అస‌లు రాష్ట్ర‌ప‌తిగా ఎవ‌రిని నియ‌మించాలి? అనే దానిపై ముగ్గురు ప్ర‌ముఖుల‌తో కూడిన‌ ఓ క‌మిటీ వేశారు. ఈ క‌మిటీలో వెంక‌య్య స‌భ్యుడు, హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఉన్నారు. ఎంపిక క‌మిటీలోనే స‌భ్యుడు పోటీకి నిల‌వ‌కూడ‌ద‌న్న‌ది నీతి. ఆ ప్ర‌కారం చూస్తే వెంక‌య్య‌నాయుడు రేస్ నుంచి త‌ప్పుకున్న‌ట్టే. ఇక జూలై 24తో ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ప‌ద‌వీకాలం ముగుస్తోంది. అంత‌కంటే ముందే జూలై 17న రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ పోటీలో కాంగ్రెస్ త‌ర‌పున అభ్య‌ర్థి నిల‌బ‌డ‌బోతున్నారు. ఆ మేర‌క సోనియా ఓ కూట‌మిని ఏర్పాటు చేస్తున్నార‌న్న టాక్ ఉంది.