Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రస్తుత భారత దేశ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదివి కాలం జూన్ 24 నాటికి ముగుస్తుండడంతో ఇక తరువాత రాష్ట్రపతి కోసం ఎన్నికలను నిర్వహించేందుకు సీఈసీ (ప్రధాన ఎన్నికల కమిషన్) సిద్ధమవుతోంది. రీసెంట్ గా షెడ్యూల్ ని కూడా విడుదల చేసింది. ఆర్టికల్ 324 ప్రకారం రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా 18 న నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. నామినేషన్లు చివరి గడువు తేది జులై 28 వరకు నిర్ణయించారు. అలాగే వచ్చే నెల అనగా జులై 17న పోలింగ్ నిర్వహించి 20న కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని సీఈసీ ప్రధాన అధికారి తెలిపారు. దీంతో జాతీయ పార్టీలు మద్దతు దారులను ఆకర్షించే విధంగా ప్లాన్లు వేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనదైన శైలిలో రాజకీయ కోణాన్ని చూపెట్టే ప్రయత్నం చేయగా. అధికార పార్టీ బీజేపీ మాత్రం తమ నిర్ణయమే నెగ్గుతుందని ధీమాతో ఉన్నారు. ఇప్పటికే చాలా మంది ముఖ్యమంత్రులు తమ మద్దతు బీజేపీకేనని చెప్పేశారు. మరి భారత దేశ మొట్టమొదటి పౌరుడు ఎవరు అవుతారో తెలియాలంటే జులై 20 వరకు ఆగాల్సిందే.