Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తమిళ జనాలని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రజినీకాంత్ అభిమానుల్నీ ఎన్నో సంవత్సరాలు గా తొలిచేస్తున్న ప్రశ్న ఒక్కటే .. రజినీకాంత్ రాజకీయాలలోకి వచ్చేది ఎప్పుడు అని. దేవుడు ఆదేశిస్తే ఏం చేయటానికైనా సిద్ధమంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన ఆయన.. గురువారం కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తారా? అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి అయ్యాయా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.కొందరి రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం.. రజనీ తన పొలిటికల్ ఎంట్రీపై శుక్రవారం కీలక ప్రకటన వెలువరించే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ స్వయంగా రజనీ ఇంటికి వెళ్లి మరీ.. ఆయన్ను రాజకీయ రంగప్రవేశం చేయాలని కోరినా ఓకే చెప్పని రజనీ.. ఇటీవల కాలంలో తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ మార్పుల నేపథ్యంంలో ఎంట్రీ ఇవ్వాలన్న ఆసక్తితో ఉన్నట్లుగా చెబుతున్నారు.