Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

కావలసినవి: రాగిపిండి- ఒక కప్పు; బెల్లం- ఒక కప్పు
వేయించిన నువ్వులు- అర కప్పు; నెయ్యి- మూడు చెంచాలు
ఏలకుల పొడి- ఒక చెంచా; జీడిపప్పు, కిస్‌మిస్ – పిడికెడు

తయారీ:
* మందపాటి బాణలిలో రాగిపిండిని (నూనె లేకుండా) దోరగా వేయించాలి.
* నేతిలో జీడిపప్పు, కిస్‌మిస్ వేయించి రాగిపిండిలో వేయాలి.
* పావు కప్పు నువ్వులను మిక్సీలో కాస్త పలుకుగా పొడి చేసుకోవాలి. అందులోనే బెల్లం తురుము, ఏలకుల పొడి వేసి మరోసారి బ్లెండ్ చేస్తే సమంగా కలుస్తుంది. నువ్వులలోని నూనె, బెల్లంలోని తేమ కలిసి మిశ్రమం ముద్దగా అవుతుంది. ఈ మిశ్రమాన్ని రాగిపిండిలో వేసి బాగా కలపాలి.
* ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని మిశ్రమాన్ని లడ్డులుగా చేయాలి. లడ్డును వేయించిన నువ్వులలో ముంచి, నువ్వులు లడ్డుకు పట్టించాలి.