Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దేశంలోని నల్ల ధనాన్ని రూపు మారాలని మోడీ పెద్ద నోట్లను రద్దు చేశారు. కానీ ఆ ప్లాన్ కు అడ్డుగా ఉన్న అసలు విలన్లు బ్యాంకు అధికారులే అని గత కొన్ని రోజులుగా ప్రహ్ట్రామ్ జరుగుతోంది.కాగా తాజాగా ఐటి అధికారులు జరుపుతున్న దాడుల్లో అదే నిజమని తేలుతోంది.దేశం లోనే మూడో అతిపెద్ద ప్రయివేటు బ్యాంకు అయిన యాక్సిస్ బ్యాంకు లో వరుసగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్యాంకు అధికారుల అండతోనే భారీ మొత్తంలో అవినీతో జరుగుతోంది.

యాక్సిస్ బ్యాంకు అధికారులు 20 నకిలీ కంపెనీల అకౌంట్లను తయారు చేసి వాటిలో రూ 60 కోట్ల మొత్తాన్ని జమచేశారు.కొత్త మంది బడా బాబులతో చేతులు కలిపినా బ్యాంకు అధికారులు ఈ అక్రమానికి పాల్పడ్డారు. ఐటి అధికారుల దాడుల్లో ఈ విషయం బట్టబయలైంది. యాక్సిస్ బ్యాంకులో పెద్దయెత్తున అక్రమాలు జరుగుతున్నాయన్నా వార్తలతో అధికారులు ఆ బ్యాంకు పై దాడి చేసారు. మరోవైపు కేంద్ర ఆర్ధిక కార్యదర్శి శక్తి కాంత్ మాట్లాడుతూ ఐటి అధికారుల దాడులు ఇంకా కొనసాగుతాయని చెప్పారు. కరెన్సీ కష్టాలు కూడా త్వరలోనే తీరుతాయని పెద్ద యెత్తున రూ 500 నోట్లని ముద్రించే ప్రక్రియ కొనసాగుతోంది అన్నారు.కాగా యాక్సిస్ బ్యాంకు తన పరువుని తిరిగి నిలుపుకునే చర్యల పై ద్రుష్టి సారించింది.అథిరోపణలు వచ్చిన అధికారులను 24 మందిని విధుల నుంచి తొలగించింది. 50 ఖాతాలను రద్దు చేసింది.