Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఇటీవల భారత్, పాక్ మధ్య నెలకొన్న యుద్ధ మేఘాలు పాకిస్తాన్ నటులకు పెద్ద చిక్కునే తెచ్చి పెట్టాయి. పాక్ ఉగ్రవాదులు, సైన్యం భారత జవాన్లపై ధాడికి నిరసనగా పాక్ నటులను బాలీవుడ్ లో తీసుకోవద్దని వారికి తక్షణమే ఉద్వాసన పలకాలని పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయుకులు డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ విదితమే. అయితే ఈ జాబితాలో భారత వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబాని సైతం చేరారు. ప్రముఖ పాత్రికేయులు శేఖర్ గుప్తా, బర్ఖాదత్ ఆద్వర్యంలో ‘ది ప్రింట్’ నిర్వహించిన ‘ఆఫ్ ది కఫ్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తనకు కళలు, సంస్కృతి కన్నా భారతదేశమే ముఖ్యమైనదని స్పష్టం చేశారు. ‘నేను ఒక విషయం గురించి చాలా స్పష్టంగా ఉన్నానన్నారు. నేను మేధావిని కాదు కాబట్టి ఇవన్నీ నాకు అర్థం కావు. కాకపోతే అందరిలాగానే నేనూ భారతీయున్నే అందుకే నేనుకూడా దేశ భక్తికే ఓటువెస్తానని స్పష్టం చేశారు. కాగా, సల్మాన్, ప్రియాంకా తదితరులంతా పాక్ నటులపై ఎందుకు నిషేధం విధించారంటూ ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.