Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో దేశప్రజలు చాలా సమస్యలు ఎదుర్కుంటున్నారు. దీనిని నివారించడానికి డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఇపుడు కేంద్రం ఇంకొక అడుగు ముందుకేసి రెండు లక్కీ డ్రా పథకాలను మొదలు పెట్టింది. మీకు అదృష్టం బాగుంటే ఆ డ్రా లో కోటి రూపాయలు గెలుచుకోవచ్చు.

అసలు విషయమేంటంటే… దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాడని ప్రభుత్వం ఒక వినూత్నమైన ఆలోచన చేసింది. దానిలో భాగంగానే రెండు లక్కీ డ్రా పథకాలను ప్రవేశపెట్టింది. అందులో 1:లక్కీ గ్రాహక్ యోజన, 2:డిజి ధన్ వ్యాపారి యోజన. ఈ పథకాలను క్రిస్మస్ రోజైన 25 వ తారీఖున ప్రారంభిస్తారు. 2017 ఏప్రిల్ 14 న అంబేద్కర్ జయంతి వరకు కొనసాగుతాయని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ చెప్పారు.

లక్కీ గ్రాహక్ యోజన: ఈ పథకం వినియోగదారులకు సంబంధించింది. ఇందులో వందరోజులపాటు ప్రతిరోజూ 15 వేల మందిని డ్రా ద్వారా ఎంపిక చేసి వారికీ ఒక్కొక్కరికి 1000 రూపాయలు బహుమతిగా ఇస్తారు. వారానికి ఒకసారి 7 వేల మందికి లక్ష, 10 వేలు, 5 వేలు బహుమతిగా ఇస్తారు. ఈ పథకం రూపేకార్డ్, ఎస్‌ఎస్‌ఎస్‌డీ, ఆధార్ ఆధారిత చెల్లింపులు జరిపే వారికి మాత్రమే వర్తిస్తుంది. వీసా, మాస్టరుకార్డులు, ప్రైవేట్ కంపెనీ ఈ-వ్యాలెట్లు వాడేవారు ఈ పరిధిలోకి రారు. ఇంకా వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలు, ఒక బ్యాంకు నుండి ఇంకొక బ్యాంకుకు చేసే ఆన్ లైన్ బదిలీలకు ఈ పథకం వర్తించదు.

డిజి ధన్ వ్యాపారి యోజన: ఈ పథకం డిజిటల్ పద్దతిలో వ్యాపారాలు నిర్వహించే వ్యాపారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పథకం లో వారానికోసారి డ్రా తీసి 50,000 వేలు, 5,000 వేలు, 2,500 రూపాయలు బహుమతిగా ఇస్తారు.

ఈ పథకాలను ఏప్రిల్ 14, 2017 న ముగిస్తారు. ఆ సందర్భంగా మెగా డ్రా నిర్వహిస్తారు. వినియోగదారులకు, వ్యాపారులకు వేరువేరుగా ఈ మెగా డ్రా ఉంటుంది. వినియోగ దారులకు నిర్వహించిన మెగా డ్రాలో మొదటి విజేతకు కోటి, రెండవ విజేతకు 50 లక్షలు, మూడవ విజేతకు 25 లక్షలు అందిస్తారు.

వ్యాపారులకు నిర్వహించే మెగా డ్రాలో మొదటి విజేతకు 50 లక్షలు, రెండవ విజేతకు 25 లక్షలు, మూడవ విజేతకు 5 లక్షలు అందిస్తారు.

లావాదేవీల గుర్తింపు సంఖ్య (ట్రాన్సక్షన్ ఐడి) ఆధారంగా ర్యాండం డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేస్తారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ఈ చర్య దోహద పడుతుందని మోడీ ట్వీట్ చేశారు.