Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మామిడి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆయుష్షును పెంచే మామిడిని పండ్లలో రారాజుగా పిలుస్తారు. వేసవిలో పుష్కలంగా లభించే మామిడిలో.. వేడి చేస్తుందని తినడం మానేయకూడదు. బాగా పండిన మామిడిని తీసుకోవడం ఎంతో మంచిది. అయితే ఆహారంతో కలిపి మామిడి పండ్లను కలిపి తీసుకోవడం అంత మంచిది. వేసవిలో మామిడిని లంచ్‌కు సైడిష్‌‌గా తీసుకోకూడదు. పరగడుపున అస్సలు తీసుకోకూడదు. ఆహారం తీసుకున్నాక 20 నిమిషాల తర్వాత మామిడి ముక్కల్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.
మామిడిలో 15 శాతం షుగర్, విటమిన్ ఎ,బి,సిలున్నాయి. వంద గ్రాముల మామిడి పండులో
తేమ – 76.0 గ్రాములు
పీచు – 0.6 గ్రా
ధాతువులు – 0.4 గ్రా
ఫాట్ – 0.4 గ్రాములు
పిండి పదార్థాలు – 17.0 గ్రాములు
ఐరన్ – 1.2 మి.గ్రాములు
థయామిన్ – 0.8 మి. గ్రాములు
నియాసిన్ – 0.8  మి. గ్రాములు
విటమిన్ సి- 16.0 మి.గ్రాములు
మామిడి ప్రయోజనాలు :
ఉదయం అల్పాహారం ముగిశాక 30 నిమిషాల తర్వాత 50 గ్రాముల మామిడి జ్యూస్‌కు ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. ఇలా 48 రోజులు తీసుకోవడం ద్వారా ఉదర సంబంధిత సమస్యలు దూరమవుతాయి. మామిడి పండు జ్యూస్, తేనె, కుంకుమ పువ్వు, ఏలకుల పొడి, పచ్చకర్పూరం కలిపి.. కాసింత మరిగించిన పాలును చేర్చి రాత్రి పూట డిన్నర్ ముగిశాక తీసుకుంటే గుండెను పదిలం చేసుకోవడమే కాకుండా.. హృద్రోగ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
పిల్లలకు అన్నం తినిపించాక మామిడి పండును ఇవ్వడం మంచిది. మామిడి ముక్కలకు కాస్త నెయ్యి రాసి ఇవ్వడం ఇంకా మంచిది. రాత్రి పూట పాలు నెయ్యి రాసిన మామిడి ముక్కలను ఇస్తే పిల్లలకు పుష్టి చేకూర్చినట్లవుతుంది. రాత్రి తీసుకునే ఆహారాన్ని తగ్గించి మామిడి పండ్ల ముక్కలు, పాలు తీసుకుంటే.. జీర్ణ సమస్యలను దూరం చేసుకోవచ్చు. మహిళల్లో నెలసరి సమస్యలకు చెక్ పెట్టాలంటే… వేసవిలో పాలతో పాటు కలుపుకుని రాత్రి భోజనానికి తీసుకోవడం మంచిది. ఇలా 15 రోజుల పాటు తీసుకుంటే నెలసరి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
రాత్రి పూట మామిడి జ్యూస్ తీసుకుంటే చర్మం ప్రకాశవంతమవుతుంది. సంతాన లేమికి మామిడి చెక్ పెడుతుంది. పురుషుల్లో వీర్యాన్ని వృద్ధి చేస్తుంది. మధుమేహగ్రస్థులు.. చర్మ సమస్యలుంటే మామిడిని ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది.