Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మంచి మాట‌కారి మంచి నాయ‌కుడు కాగ‌ల‌డు! ఇది జ‌గ‌త్ స‌త్యం. అయితే ఈ విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గ్రేటా? తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ్రేటా? .. ప్ర‌స్తుతం ఊరూ వాడా ఓటింగ్ పెడితే ఏ నేత గెలుస్తాడు? .. ఈ విష‌యంలో ప‌క్కా క్లారిటీ ఇవ్వ‌మ‌ని అడిగితే మీడియా అయితే ఏం చెబుతోందో తెలుసా?

మాట‌కారిత‌నంలో బాబు ఎప్పుడూ వెన‌కే ఉంటాడు. ఆ విష‌యంలో కేసీఆర్ ది బెస్ట్ అనే చెబుతున్నారు. త‌ను ఏం చెప్ప‌ద‌లిచాడో అది ప‌క్కాగా కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు చెప్ప‌డ‌మే కాదు.. ఏమాత్రం త‌డ‌బ‌డ‌కుండా క్లియ‌ర్ క‌ట్‌గా అర్థం అయ్యేలా విడ‌మ‌ర్చి చెప్ప‌డం కేసీఆర్‌కి వెన్న‌తో పెట్టిన విద్య‌. ఆ సంగ‌తి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ఆయ‌న ఇచ్చిన ప్ర‌సంగాలు చెబుతాయి. అదే చంద్ర‌బాబు విష‌యంలో తీసుకుంటే ఆయ‌న మాట‌ల్లో అంత ఘ‌నాపాటి కానేకాదు. అత‌డు సీఎం అయిన కొత్త‌రోజుల్లో కంటే ఇప్పుడు బెట‌ర్‌గా మాట్లాడుతున్నారు కానీ, అప్ప‌ట్లో అయితే చాలానే త‌డుముకునేవారు. ఇప్పుడు అన్నిర‌కాలా రాటు దేలారు కాబ‌ట్టి కాస్త‌యినా ఆయ‌న ప్ర‌సంగం వినాల‌నిపిస్తోంది. లేదంటే ప్ర‌సంగం మొద‌లైన పావు గంట‌కే స‌భికులంద‌రికీ నిద్ర వ‌చ్చేసేది. కానీ కేసీఆర్ అలా కాదు.. ప్ర‌సంగం మొద‌లు పెట్టిన త‌ర్వాత ఇక ఎవ్వ‌రినీ నిద్ర‌పోనివ్వ‌డు. అలాంటి ఛ‌మ‌క్కులు పేల్చ‌డంలోనూ ఆయ‌న ఘ‌నాపాటి అని విశ్లేషిస్తున్నారు. అయితే పాలనా ప‌ర‌మైన అనుభ‌వంలో చంద్ర‌బాబును కొట్టేంత మొన‌గాడు వేరొక‌డు లేడ‌ని, ఆయ‌న త‌ల‌పండిన సీఎం అని పొగిడేస్తున్నారు. కేసీఆర్ సీఎం అయ్యింది ఇప్పుడే. తొలి ఏడు నెల‌లు ఎలా పాలించాలో తెలీక స‌త‌మ‌త‌మ‌య్యాన‌ని ఆయ‌నే స్వ‌యంగా ఒప్పుకున్నారు. ఇక‌నుంచి ఆయ‌నా రాటు దేల‌తారు పాల‌న‌లో. మాట‌ల్లో అయితే ఆయ‌న బెస్ట్ మ‌రి!