Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ తర్వాత వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ముస్లిం దేశాలపై నిషేధం, హెచ్ 1బి వీసాల జారీ కఠినతరం చేయడం, అమెరికాలో అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ప్రకటించడం లాంటి నిర్ణయాలతో ఆయన ప్రపంచం నలుమూలల నుండి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇతర దేశాల నుండే కాకుండా ఆయనకు ఓటు వేసి గెలిపించిన అమెరికన్స్ కూడా ఆయన నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. తమకు మాజీ అధ్యక్షుడు ఒబామానే అధ్యక్షుడుగా కావాలని వారు కోరుకుంటున్నారు.

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన రెండు వారాలకే చాలామంది అమెరికన్లు ఆయనపై విరక్తిని పెంచుకున్నారు. తమకు ట్రంప్ అధ్యక్షుడిగా వద్దని, బరాక్ ఒబామా తిరిగి తమకు అధ్యక్షుడిగా కావాలని వారు కోరుకుంటున్నారు. పబ్లిక్ పాలసీ పోలింగ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఒబామా తిరిగి అమెరికా అధ్యక్షుడిగా రావాలని 52 శాతం మంది కోరుకుంటున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉండాలని కేవలం 43 శాతం మంది కోరుకుంటున్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ను ఆ పదవి నుండి దించేయాలని ఎక్కువమంది అమెరికన్లు కోరుకోవడం విశేషం.