Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

భారత దేశ గొప్ప దర్శకుల జాబితాలో మణిరత్నం కూడా ఉంటారు.రోజా, బాంబే వంటి చిత్రాలే అయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనాలు. ఆయన సినిమాలన్నీ సున్నితమైన భావోద్వేగాలతో కూడి ఉంటాయి. గత కొంత కాలంగా ఆయనకు సరైన హిట్ లేనిసమయంలో ‘ఓకే బంగారం’ చిత్రం పరవాలేదనిపించే విజయాన్ని నమోదు చేసుకుంది.కాగా నేడు ఆయన దర్శకత్వం వహించిన ‘చెలియా’ చిత్రం ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇందులో కార్తి, అతిధి రావు లు జంటగా నటించారు. మొదటి షో టాక్ ని బట్టి ఈ చిత్రం ఎలా ఉందొ చూద్దాం.

రోజా చిత్రంలాగే ఇందులో కూడా మణిరత్నం పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ కథని ఎంచుకున్నారు.మొదటి అర్థ భాగం పరవాలేదనిపించే విధంగానే సాగింది. కానీ రెండవ అర్థ భాగం కథని దర్శకుడు మరీ సాగదీసాడు.మణిరత్నం స్టైల్ లోని చిత్రాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చే అవకాశాలు ఉన్నాయ్.కానీ సాధారణ ఆడియన్స్ కి మాత్రం ఈ చిత్రం బోర్ కొడుతుంది.సాధారణంగానే మణిరత్నం సినిమాలు స్లోగా సాగుతాయి. స్లోగా సాగే కథలు ఇప్పటి ఆడియన్స్ కు నచ్చే అవకాశాలు తక్కువని అంటున్నారు. చిత్రం స్లోగా ఉన్నా అందులో బలమైన భావోద్వేగంతో కూడిన సన్నివేశాలు ఉంటే నెట్టుకుని రావచ్చు.సెకండ్ హాఫ్ లో అది లోపించిందని అంటున్నారు.కార్తి మరియు అతిది రావు ల జోడీ ,అందమైన లొకేషన్ లలో సినిమాని చిత్రీకరించడం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ గా చెబుతున్నారు.