Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దేశంలో రోజు రోజుకి కామందులు, అమాయిలని వేధించే వారి సంఖ్య పెరిగిపోతుంది. మామూలు జనం నుంచి, పెద్ద పెద్ద ప్రముఖుల వరకు ఇలాంటి నేరాల్లో ఈ మధ్య చిక్కుకుంటున్నారు. అలాంటి సంఘటన తాజాగా బెంగుళూరు లో వెలుగులోకి వచ్చింది. అతను జమ్మూ కాశ్మీర్ అబ్దుల్ గని తనయుడు, అతని పేరు హబీబ్ గని, బెంగుళూరు లో చదువుకుంటూ ఓ కంపెనీలో వుద్యోగం చేస్తున్నాడు. అయితే అతను పని చేస్తున్న కంపెనీలో ఉద్యోగానికి వచ్చే అమ్మాయిలతో మాట్లాడుతూ, వారి ఫోన్ నెంబర్స్ సంపాదించేవాడు. తరువాత వాళ్లకి ఫోన్ చేసి ఉద్యోగం కావాలంటే తన రూమ్ కి రావాలని ఫోన్ చేసేవాడు, అలా వాడిని నమ్మి వచ్చిన అమ్మాయిలతో కోరికలు తీర్చుకునే వాడు. కొందరు వాడి మోసం తెలిసి తప్పుకునేవారు. అలా వాడి పనిలో భాగంగా ఉడిపి జిల్లాకి చెందిన ఓ యువతీ ఇంటర్వ్యూ కి హాజరైంది. బయటకు వెళ్ళాక ఆమె దగ్గరకి వెళ్లి ఉద్యోగం కావాలంటే తన రూమ్ కి రావాలని బలవంతం చేసాడు. ఆమె రానని మొండి చేసే సరికి తన కారులోకి లాగి బలవంతం చేసే ప్రయత్నం చేసాడు. అయితే ఆ అమ్మాయి ఎలాగోలా వాడి నుంచి తప్పించుకొని బెంగుళూరు లో మైకో లే అవుట్ లో ఫిర్యాదు చేసింది. ఆమె కంప్లైంట్ తీసుకున్న పోలీసులు హబీబ్ గనిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వాడి దగ్గర వున్న కాల్ డేటా ఆధారంగా సుమారు 300 మందిని వాడు వేధించి ఉంటాడని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసి, నిజంగా నిందితుడు చెబుతున్నట్లు అతను జమ్మూ కాశ్మీర్ మాజీ మంత్రి కొడుకో కాదో అనే విషయాన్ని కూడా పోలీసులు తెలుసుకునే పనిలో వున్నారు.