Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తెలంగాణలో భూ కుంభకోణంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులూ కె. కేశవరావుని ఇరికించే ప్రయత్నం జరుగుతుందా అంటే అవుననే మాట వినిపిస్తుంది తెలంగాణా రాజకీయ వర్గాల్లో. గోల్డ్ స్టోన్ ఆధీనంలో వున్న అక్రమ భూములని కె.కేశవరావు కుటుంబం భారీ ఎత్తున కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిసింది. అయితే ఇందులో అక్రమాలు జరిగినట్లు తెలంగాణా ప్రభుత్వం విశ్వసిస్తూ, ఆ భూములని రిజిస్టర్ చేసిన సబ్ రిజిస్టర్ ఖదీర్ పత్రాలు చూడకుండా రిజిస్టర్ చేసారని ఆరోపిస్తూ ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసింది. గోల్డ్ స్టోన్ పార్ధసారధి నుంచి అటవీశాఖ ఆద్వర్యంలో వున్న 36 ఎకరాల భూమిని కేశవరావు కొనుగోలు చేసి తన కూతురు గద్వాల్ విజయలక్ష్మి ఆమె కోడలు పేరు మీద రిజిస్టర్ చేయించారు.

అయితే ఈ పత్రాలని పరిశీలించిన ప్రభుత్వం అవి డూప్లికేట్ అని నిర్ధారణకి వచ్చి, అందులో ఆక్రమణలు జరిగాయని చెప్పడం, దానికి బాధ్యుడిని చేస్తూ సబ్ రిజిస్టర్ ని సస్పెండ్ చేసారు. అయితే ఈ భూములు అక్రమం కాదని పక్కా డాక్యుమెంట్లు ఉన్నందునే తాను కొనుగోలు చేసానని కేశవరావు చెబుతున్నారు. హై కోర్టు ఆర్డర్ తెప్పిన్చుకొనే రిజిస్టర్ చేయిన్చుకున్నామని చెబుతున్న. ఆయన మాటలు ప్రభుత్వం వినే పరిస్థితిలో లేదు. ఈ అక్రమ భూములపై పూర్తి స్థాయి విచారణ చేసి, అవసరమైతే కేశవరావు మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ భూ కుంభకోణంలో అందరు కలిసి తనని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కేశవరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆక్రమణలతో తనకు సంబంధం లేకపోయినా కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అంటున్నారు. దీనిలో తనని తారు నిరూపించుకోవడం కోసం ఎంతవరకైన వెళ్తానని ఆయన అంటున్నారు.