Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మన ప్రకృతిలో ఎన్నో అందాలు ఎన్నో వింతలు మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. అయితే మన ప్రకృతిలో ఉన్న జీవరాశుల్లో సైతం వింతైన జీవులు ఎన్నో అన్నాయి. అయితే అవన్నీ మనకు ఎప్పుడు కనబడుతూ ఉండవు. కొన్ని అనుకోని సందర్భాల్లో అవి నాగరిక సమాజంలోకి వచ్చి ప్రజలను అందరినీ ఆశ్చర్యంలోకి ముంచేత్తుతాయి. అయితే అందులో భాగమే ఈ స్వర్ణ నాగు. చిత్తూరు జిల్లా కేవీబీపురం న్యూకాలనీలో శనివారం ఉదయం ఓ ఆరుదైన భారీ స్వర్ణనాగు దారి తప్పి ఒక ఇంట్లోని నీటితొట్టెలో పడింది. ప్రాణాలను కాపాడుకోవడానికి తంటాలు పడుతున్న ఆ పామును చూసిన ఇంటి యజమాని మునెమ్మ అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే లేత స్వర్ణం రంగులో నీటిపై ప్రాణాలను కాపాడుకోవడానికి తాపత్రయ పడుతున్న ఈ పామును అటవీ అధికారులు సురక్షితంగా బయటకు తీసి అటవీ ప్రాంతంలో వదిలారు. అయితే ఈ అరుదైన భారీ పామును చూడడానికి భారీ స్థాయిలో ప్రజలు రావడం విశేషం…!!