Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఏపీ, తెలంగాణలోని పాఠశాలల్లో మౌలికవసతుల కొరతతో పాటు బోధన సిబ్బంది పోస్టుల ఖాళీలు భారీగా ఉన్నాయని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. ఎంపీలు కొత్తపల్లి గీత, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నంది ఎల్లయ్య అడిగిన వేర్వేరు ప్రశ్నలకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సోమవారం లోక్‌సభలో సమాధానం ఇచ్చారు.

2016, మార్చి 31 నాటికి ఏపీలో 19,468 టీచర్ పోస్టులు, తెలంగాణలో 13,049 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అలాగే 9, 10 తరగతులకు సంబంధించి ప్రభుత్వ సెకండరీ పాఠశాలల్లో ఏపీలో 5,056, తెలంగాణలో 3,144 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు చెప్పారు.