Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

”ఆ ఆ” తరువాత యువ హీరో నితిన్ నటిస్తున్న ”లై” చిత్రం జోరుగా అమెరికాలో షూటింగ్ జరుపుకుంటుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ”లై” సినిమాలోని .. ”బేబీ .. బొంబాటు” అంటూ సాగిన మాస్ సాంగ్ ని ఇటీవలే విడుదల చేసారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సాంగ్ మాస్ లో ఒక ఊపు ఊపేస్తోంది ? పక్క తెలంగాణ స్లాంగ్ లో రూపొందిన ఈ సాంగ్ లో నితిన్ లుంగీ డాన్స్ లో అదరగొట్టాడట!! ఇప్పటికే ఏక్కడ చుసిన ఈ సాంగ్ హుషారెత్తిస్తోంది. గత పదిహేను రోజులుగా అమేరికాలో షూటింగ్ జరుపుకుని ఈ రోజు ఈ టీమ్ ఇండియా రానుంది. నితిన్ సరసన మేఘ ఆకాష్ నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేస్తారట. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్జున్ విలన్ గా నటిస్తున్నాడు.