Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

భారీ మోసానికి పాల్పడిన ఇద్దరు భారతీయ అమెరికన్లు జైలుపాలయ్యారు. ఓ పథకం పేరుతో దాదాపు 200 మిలియన్ డాలర్లను వీరు కొల్లగొట్టారు. చివరకు బండారం బయటపడడంతో అమెరికా కోర్టు వీరిద్దరికి 14 నెలల క్జిలు శిక్ష మరియు ఏడాదిపాటు గృహ నిర్బంధం విధించింది. అమెరికాలో స్థిరపడిన విజయ్ వర్మ (49), తర్సిం లాల్ (78) అనే వీరు న్యూజెర్సీ లో ఓ జ్యాలరీ స్టోర్ కు యజమానులుగా ఉన్నారు.

ఘరానా మోసానికి పాల్పడి సొమ్ము పోగేసుకోవాలనుకున్న వీరిద్దరూ 2013 లో 7000 నకిలీ అడ్రెస్ లతో వేలాదిగా క్రెడిట్ కార్డులు రాబట్టారు. ఆ కార్డులను తమ స్టార్ లోనే స్వైప్ చేసి మొత్తం నగదు వారి అకౌంట్ లోకి బదిలీ అయ్యేలా చేసుకున్నారు. ఇలా 200 మిలియన్ డాలర్ల నగదు వారి ఖాతాల్లోకి చేరింది. కానీ క్రెడిట్ కార్డుల సంబందించిన చిరునామాల నుంచి ఎవరూ వాటి బిల్లులు చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతో ఈ వ్యవహారం బయటపడింది. దీనిపై దర్యాప్తునకు ఆదేశించగా. వీరిద్దరూ హైటెక్ మోసానికి పాల్పడినట్లు తేలింది. క్రెడిట్ కార్డులను వారే సృష్టించి వారే మోసానికి పాల్పడిన వైనానికి అధికారులు ఆశ్చర్యపోయారు. కేసు నమోదు చేసి జైలుకు తరలించగా వారికి జైలు 14 నెలల జైలు శిక్ష, మరియు ఏడాది పాటు గృహ నిర్బంధం విధించింది.