Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

పాతబస్తీలో కొన్నిరోజులుగా స్ట్రీట్ ఫైటింగ్స్ జరుగుతున్నాయని సౌత్ జోన్ డిసిపి సత్యనారాయణ తెలిపారు. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న నబీల్ అనే యువకుడు స్ట్రీట్ ఫైటింగ్ లో మరణించటంతో వాటివెనుక దాగిన నిజాలను ఆయన మీడియాకు వివరించారు. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు ధనవంతుల పిల్లలు డబ్ల్యు.డబ్ల్యు.ఎఫ్ తరహాలో వీధిలో కొట్టుకున్నారు. అబేజ్ అనే వ్యక్తి పిడిగుద్దులు తట్టుకోలేక నబీల్ కిందపడి చనిపోయాడు. ఈ ఘటనను యాక్సిడెంట్ గా మార్చారు నబీల్ స్నేహితులు. తమ కొడుకుని హత్య చేసారంటూ నబీల్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసారు. నబీల్ మృతదేహానికి సోమవారం ఫోర్సెనిక్ బృందం సమక్షంలో పోస్ట్ మార్టం నిర్వహిస్తామని చెప్పారు. ఈ కేసులో వాట్స్ యాప్ ద్వారా పంపిన వీడియో ఆధారంగా 7 గురి నిందితులను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్ట్రీట్ ఫైటింగ్స్ ను బెట్టింగ్ గానే గుర్తించామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆదివారం రోజు చార్మినార్ తో పాటు మూడు చోట్ల స్ట్రీట్ ఫైటింగ్స్ జరిగాయని డిసిపి చెప్పారు.