Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రతిఏడాది బిటెక్ ద్వారా ఇంజనీరింగ్ విద్యని పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు లక్షల్లో బయటకు వస్తున్నారు. బిటెక్ విద్యార్థులు ఉద్యోగాల కొరతతో సతమతమవుతున్న విశయం తెలిసిందే. దీనిపై ప్రముఖ ఐటి విశ్లేషకుడు మోహన్ దాస్ పాయ్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కేవలం బిటెక్ డిగ్రీతో మాత్రమే ఉద్యోగాలు రావని మోహన్ దాస్ అన్నారు. రాబోవు రోజుల్లో ఐటి కంపెనీలు ఎం టెక్ డిగ్రీతో పాటు, సబ్జెక్టు స్పెషలైజేషన్ ని కూడా పరిగణలోకి తీసుకుంటాయని వ్యాఖ్యానించారు. కంపెనీలు ఉద్యోగాల కొరకు చేసుకునే రిక్రూట్ మెంట్ లలో కఠినమైన నిబంధనలను అమలు చేయనున్నాయని ఆయన అన్నారు.

ప్రస్తుతం కొందరు బిటెక్ గ్రాడ్యుయేట్లను కంపెనీలు రిక్రూట్ చేయుకుంటున్నా వారికీ ఆరునెలల పాటు టైనింగ్ ఇస్తునారని మోహన్ దాస్ పేర్కొన్నారు. భవిష్యత్తులో కంపెనీలు అంత టైం వేస్ట్ చేసుకోవడానికి సిద్ధంగా లేవని ఆయన అన్నారు. ఐటి ఉద్యోగాల కోసం అప్లై చేసే వారి కోడింగ్ పరిజ్ఞానాన్ని పరిగణలోకి తీసుకునే భవిష్యత్తు లో ఎంపికలు జరుగుతాయని అన్నారు. ప్రతి ఏడాది లక్షల మంది గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నా అందుకు తగ్గ రీతోలో ఉద్యోగాలు లేవని అన్నారు. సప్లై ఎక్కువగా ఉన్నా డిమాండ్ లేదని మోహన్ దాస్ అన్నారు. కాగా ఐటి సంస్థలన్నీ భారీ స్థాయిలో ఉద్యోగాలు తొలగించనున్నాయని వస్తున వార్తలని మాత్రం ఆయన ఖండించారు. అవి కేవలం పుకార్లు మాత్రమే అని అన్నారు.