Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

రాజమౌళి ఇష్టపడి.. కష్టపడి తీసిన సినిమా బాహుబలి. దాదాపు 250 కోట్ల రూపాయల వ్యయంతో.. మూడు సంవత్సరాల పాటు కష్టపడి నిర్మించారు. ఈ సంవత్సరం జులై 10 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో.. సినిమా సూపర్ హిట్ అయింది. ఇకపోతే, దక్షిణభారత సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమాకు సాధ్యం కాని రికార్డ్ ను బాహుబలి సొంతం చేసుకున్నది. దాదాపు 600 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

ఇక, ఇప్పుడు రాజమౌళి బాహుబలి 2 పై దృష్టి సారించారు. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ రెండో వారం నుంచి ప్రారంభం కానున్నది. అయితే, సినిమా షూటింగ్ కు ముందే సినిమాను బిజినెస్ చేస్తున్నారట. కాని, బాహుబలి 2 రేటు భారీగా చెప్తున్నారట. రాజమౌళి చెప్పిన రేటుకు కొనాలంటే.. బయ్యరు భయపడుతున్నారని తెలుస్తున్నది. మొదటి భాగంలో భారీగా లాభాలు వచ్చాయి. అయితే, రెండో భాగం షూటింగ్ ఇంకా మొదలే కాలేదు. రాజమౌళి చెప్పిన రేటుకు కొంటె.. ఆ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో తెలియదు. విడుదల తేదీ అయినా ప్రకటించలేదు.

ఇప్పుడు రాజమౌళి చెప్పిన రేటుకు కొంటే, సినిమా విడుదల అయ్యే నాటికి వడ్డీ భారీగా పెరిగిపోతుంది. వడ్డీ భారీ స్థాయిలో పెరిగి తడిసి మోపెడు అవుతుందని బయ్యర్లు జంకుతున్నారట. పోనీ.. ధైర్యం చేసి కొంటె.. సినిమా సోసో గా ఉంటె.. పరిస్థితి ఏమిటని అంటున్నారు బయ్యర్లు. అయితే, రాజమౌళికి ఇంతవరకు పరాయజం లేదు.. కాబట్టి ధైర్యం చేసి సినిమా కొనచ్చని కొందరి వాదన.