Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఇండోనేషియా దీవుల్లో ఓ భారీ సముద్ర జీవి మరణించిన కళేబరం ఒడ్డుకు కొట్టుకుని చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.చూసినంత మేర ఉన్న ఈ భారీ కళేబరాన్ని చొసేందుకు జనం ఎగబడుతున్నారు. 49 అందుగులు ఉన్న ఈ భారీ సముద్ర జంతువు సెరమ్ ఐలాండ్ లో దర్శనమిచ్చింది. ఇది మరణించడంతో దాని కళేబరం తీరానికి కొట్టుకుని వచ్చింది. కాగా కొంత మంది మెరైన్ నిపుణులు దీనిని బలీన్ వేల్ గా చెబుతున్నారు. ఈ వింత జంతువు యొక్క నోటి భాగం, ఎముకలు మొదలగునవి స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ వింత జీవి గురించి వేల్ మరియు డాల్ఫీన్ ల ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ రెజీనా మాట్లాడారు. బలీన్ వేల్ లలో ఇది అతిపెద్ద జాతి అని ఆమె పేర్కొన్నారు.అవి వాటి ఆహారం తీసుకునే సమయంలో మాత్రమే వాటి దవడలు తెరుస్తాయని ఆమె అన్నారు. ఈ వింత జీవి కళేబరం లో ఆమె దాని దవడలు గుర్తించారు. మరో సీనియర్ సముద్ర శాస్త్రవేత్త ఐన ఎడ్విత్ విద్దెర్ మాట్లాడుతూ దీనికళేబరాన్ని చూసి అది ఏ జాతో గుర్తించడం కష్టమని, తన అంచనా ప్రకారం అది బలీన్ వేల్ అని ఆమె తెలిపారు. కాగా వీడియోలో చూస్తుంటే దాని కళేబరం చుట్టూ ఉన్న నీరు ఎరుపు వర్ణంలోకి మారిపోయింది.కొంత మంది ఉత్సాహికులు అది ఏ జంతువో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి స్థానిక ప్రజలు ఆ కళేబరాన్ని తొలగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పలు సందర్భాలలో సముద్ర జతువులు మరణించి ఒడ్డుకు కొట్టుకుని రావడం సహజమే. కానీ ఇంత భారీ కళేబరాన్ని తాము చూడడం మాత్రం ఇదే తొలి సారి అని అంటున్నారు.