Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రస్తుతం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఎక్కడ చూసిన ప్రజల నోటి నుంచి వినిపిస్తున్న మాట ఇదే అసలు హైదరాబాద్ కి ఏమైంది. ఇంకా ఎంతకాలం ఈ నరకప్రాయమైన జీవితం. ఇలానే హైదరాబాద్ నగరం ఉంటె భవిష్యత్తులో ప్రజల పరిస్థితులు ఏంటి అనే ఆందోళన ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటని చూసుకుంటే ఒకటే మాట. వర్షాకాలం వచ్చింది. హైదరాబాద్ నగరం మునిగిపోయింది. దీంతో ప్రజా జీవనం స్తంభించిపోయింది. ప్రతి ఏడాది వర్షాకాలం మొదలైతే హైదరాబాద్ కి జలుబు చేస్తుంది. దీంతో నిత్యం డ్రైనేజీల నుంచి రోడ్ల మీదకి పారుతూ ఉండే నీరు. లోతట్టు ప్రాంతాల్లో ఎల్లల్లోకి చేరిపోయిన నీరు. పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ లో సెల్లర్స్ లో, మొత్తం నీతితో నిండిపోయి రోడ్డంతా అస్తవ్యస్తంగా మారిపోతాయి. ప్రతి ఏడాది హైదరాబాద్ లో నివాసం ఉండే ప్రజల ఇదే దుస్థితి ఎదుర్కొంటున్నారు. అసలు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటని చూసుకుంటే పాలకులు విధానాలు, అక్రమ కట్టడాలు, నిర్వహణ లేని డ్రైనేజి వ్యవస్థ, ఎంత సేపు ఖాళీగా భూమి కనిపిస్తే వెంటనే కబ్జా చేసేసి, అక్కడో బిల్డింగ్ కట్టేయడం, చెరువు కనిపిస్తే కప్పేయడం అక్కడ ఫ్లాట్స్ కట్టేయడం ఇలా హైదరాబాద్ లో అడుగడుగున అక్రమాలు, అవినీతి, దోపిడీకి పరాకాష్ట ఇప్పుడు హైదరాబాద్ లో ఈ దుస్థితి, వర్షం పడితే ఇక హైదరాబాద్లో చాలా ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి ఉంటాయి. వర్షం పడిన తర్వాత మరల వారం రోజుల వరకు అక్కడి పరిస్థితులు కుడుతపడవు. ఇక హైదరాబాద్ లో భాగ కాస్ట్లీ ఏరియాలుగా వున్న బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్న్నాయంటే అసలు అభివృద్ధి మాటున పాలకులు ఎంత దారుణాలు చేసారో అర్ధమవుతుంది. దేశంలో హైదరాబాద్ లో ఉన్ పరిస్థితులు ఇంకా ఎ సిటీలో కూడా ఉండవు. వేసవి వస్తే నీటి సమస్య, వర్షాకాలం వస్తే ఆవాసం సమస్య, శీతాకాలం అయితే రోడ్డుపక్కన పేరుకుపోయిన వ్యర్ధాలు, మురుగు నీరుతో రోగాల సమస్య. అడుగడుగునా ఇలాంటి సమస్యలు నిత్యం హైదరాబాద్ ని ముంచుతూనే ఉంటాయి. ఈ సమస్యలు వచ్చినపుడు కాస్తా ఊరట మాటలు చెప్పి తప్పించుకునే పాలకులే ఇప్పటికి తెలంగాణాలో ఉన్నారు తప్ప. సమస్యకి శాశ్వత పరిష్కారం చూపేవారు ఎవరు లేరు. దీంతో హైదరాబాద్ లో ఈ పరిస్థితులు ఎప్పటికి చక్కబదతాయో తెలియక జనం తీవ్ర ఆందోళనలో వున్నారు.