Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రేమించిన ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ప్రముఖ టీవీ నటి రూపా హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. అయితే అదృష్టవశాత్తు ఆమెను గమనించిన పోలీసులు అలెర్ట్ అయ్యి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇరు వైపుల కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో ప్రియుడు పెళ్లికి అంగీకరించాడు. దీంతో ఆమె ప్రేమ కథ సుకాంతమైంది.
రూపను కాపాడిన లేక్ వ్యూ పోలీసులు, ఎస్సై శ్రీదేవి రూప సొదరుడిని, ఆమె ప్రియుడు కేవల్ సింగ్ కుటుంబ సభ్యులను పిలిపించి ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో ఇరు కుటుంబాలు వారి వివాహానికి అంగీకరించాయి.
కాగా, అరుంధతి, చంద్రముఖి, అంతఃపురం, శిఖరం వంటి పలు తెలుగు టీవీ సీరియల్స్‌లో నటించే నటి రూప. బోయిన్‌పల్లి సమీపంలోని సుచిత్రసర్కిల్‌లో నివాసం ఉంటున్న రూప టీవీ సీరియళ్లలో నెగెటివ్ పాత్రల్లో నటిస్తోంది. రూప, ఓ ప్రయివేటు బ్యాంకులో పని చేస్తున్న తన బంధువు కేవల్ సింగ్ ప్రేమించుకున్నారు. ఇరువురు కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు.
అయితే, పెళ్లి విషయానికి వచ్చేసరికి కేవల్ సింగ్ నో చెప్పాడు. ఆమె సీరియల్స్‌లో నటించకూడదంటూ ఒత్తిడి తీసుకొచ్చాడు. పెళ్లి మాట ఎత్తేసరికి, టీవీ నటిని పెళ్లి చేసుకోవడానికి తన కుటుంబం ఒప్పుకోవడం లేదంటూ చేతులెత్తేశాడు. అతనిని ఒప్పించలేక విసిగిపోయిన రూప చివరికి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమెను పోలీసులు రక్షించారు. అనంతరం ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు.