Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

పోయెస్ గార్డెన్ లో ఉన్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం వద్ద ఆదివారం హై డ్రామా చోటుచేసుకుంది. అమ్మ మేనకోడలు దీపా జయకుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జయలలిత ఆస్తులు తనకే దక్కుతాయని ఆమె అన్నారు. జయలలిత ఇల్లు, ఆస్తులు తనకే సొంతం అని పోయెస్ గార్డెన్ లోని జయ నివాసం వేదవల్లి లోకిని ప్రవేశించడానికి ప్రయత్నించారు. అమ్మ నివాసం ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వ ఆధీనంలో ఉంది.

పోలీస్ లు దీపని అడ్డుకోవడం ఆమె వారితో వాగ్వాదానికి సైతం వెనుకాడలేదు. దీనితో జయ ఇంటిముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తాను జయలలిత మేనకోడలినని ఆమె ఇంట్లో నివసించే అధికారం తనకు ఉందని దీప పోలీసులతో గొడవకు దిగారు. పోయెస్ గార్డెన్ వద్ద భారీగా మోహరించి ఉన్న పోలీస్ లు దీపని లోనికి అనుమతించలేదు. పోలీస్ లు దీపకి నచ్చజెప్పడానికి చాలా సమయం పట్టింది. దీపతో పాటు ఆమె అనుచరులు వెంట వెళ్లారు. జయలలితకు అధికారికంగా వారసులు లేరు. దీనితో ఆమె ఆస్తులన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. కేవలం జయలలిత ఆస్తులకే కాకా ఆమె రాజకీయ వారసురాలిని కూడా తానే అంటూ దీప ప్రకటించుకున్నారు.