Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

రోజు రోజు కి సోషల్ మీడియాలో మోసం చేసే దారుణాలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో ముఖ్యంగా యువత పేస్ బుక్ లో ఈజీ గా బుక్కవుతున్నారు. అంతే కాకుండా అవతలి వ్యక్తి ఎలాంటి వాడైనా సరే వారి మాటలకు లొంగిపోయి డబ్బులను కూడా కోల్పోతున్నారు. ఇదే తరహాలో రీసెంట్ గా బాగ్యనగరంలో ఒక యువకుడు 50 వేల రూపాయలను పోగొట్టుకున్న ఘటనను చూసి పోలీసులే షాక్ తిన్నారు.

అసలు విషయంలోకి వెలితే హైదరాబాద్ కు చెందిన అవినాష్ అనే యువకుడు సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. అతను పోలీసులకు తెలియజేసిన వివరాల ప్రకారం.గత రెండు నెలల క్రితం ఒక లండన్ కు చెందిన యువతితో పేస్ బుక్ లో పరిచయం పెంచుకున్నాడు అవినాష్. రోజు ఆమెతో చాటింగ్ చేస్తూ చివరికి వాట్సాప్ చాటింగ్,కాలింగ్ వరకు వచ్చింది. కరెక్ట్ గా పరిచయం పెంచుకున్న ఒక నెల తరువాత ఆ యువతీ నా దగ్గర చాలా డబ్బు ఉంది నువ్వు లండన్ కి రా అని చెప్పింది. దింతో అవినాష్ లేదు నువ్వే ఆ డబ్బు తీసుకొని రా ఇక్కడే ఎంజాయ్ చెయ్యొచ్చు అని చెప్పాడు. దింతో ఆ యువతీ సరే అంది. మరుసటి రోజు ఆ యువతీ ఫోన్ చేసి నేను ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాను అక్కడి కస్టమ్స్ పోలీసులకు లగేజ్ ఎక్కువగా ఉండటం వల్ల అడ్డుకున్నారు. 50 వేల రూపాయలు అడుగుతున్నారు ఇవ్వకుంటే వదలరు. హైదరాబాద్ రాగానే ని డబ్బు నీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఢిల్లీలోని ఓ బ్యాంకు ఖాతా నెంబర్ పంపింది. దింతో ఆ యువకుడు నమ్మి అకౌంట్ లో డబ్బులు వేశాడు. మరుసటి రోజు మళ్లి ఫోన్ చేసి ఇంకో లక్ష రూపాయలు కావాలి ఎందుకంటే లండన్ కరెన్సీ మార్చుకునేందుకు ఇక్కడ ముందు కొంత డబ్బు చెల్లించాలని చెప్పింది. ఇప్పటికే 50 వేలు లాగిన ఆ యువతీ పై అవినాష్ కి అనుమానం వచ్చింది. వెంటనే సైబర్ పోలీసులును ఆశ్రయించి జరిగిన మోసాన్ని చెప్పడం తో ఎస్పీ రాఘవీర్ మరియు అతని బృందం కలిసి ఢిల్లీ పోలీసుల సహాయం తో ఆ యువతిని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో ఆ యువతీ పేరు నెమ్‌ మైన్‌ కిమ్‌ (31) అని తేలింది. ఈమెకు తోడుగా మరో నైజిరియాకు చెందిన ఛుక్ వాయిదో అనే వ్యక్తి కూడా ఉన్నాడని తెల్సింది. దింతో ఇద్దరిని అరెస్టు చేశారు. త్వరలోనే కోర్టులో హాజరుపరుస్తామని పొలిసు అధికారులు తెలియజేశారు.