Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సగటు జీవి జీవితం ఫెయిల్ అవ్వడం వేరు ఒక బిలియనీర్ జీవితం ఫెయిల్ అవ్వడం వేరు. అతను తన భార్యతో విడిపోతే వ్యవహారం మామూలుగా ఉండదు. రష్యాకు చెందిన ఈ బిలియనీర్ దంపతులు తొలిసారి 1989లో మాస్కోలో పరిచయమయ్యారు. వారి పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకూ వెళ్లిపోయింది. 1993లో పెళ్లి చేసుకున్న ఈ జంట.. అదే ఏడాది రష్యాను విడిచిపెట్టి బ్రిటన్ కు వెళ్లిపోయారు. లండన్ లోని సుర్రే ప్రాంతంలో స్థిరపడ్డారు. ఇంతకాలం కలిసి ఉన్న వారిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకోవటంతో.. వారిరువురు విడిపోవాలని నిర్ణయించుకున్నారు.భరణం కింద తన మాజీ భార్యకు 584 మిలియన్ డాలర్లు.. మన రూపాయిల్లో అయితే రూ.3700 కోట్లు ఇచ్చేందుకు సదరు భర్త ఓకే చేసేశారు.