Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

పూణెలో గురువారం జరిగిన బాంబు పేలుడులో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. నగరంలోని దగ్దుసేథ్ హల్వాయ్ గణపతి ఆలయ సమీపంలో నిలిపిన ఓ మోటార్ సైకిల్ పై పెట్టిన బాంబును గుర్తు తెలియని వ్యక్తులు పేల్చివేశారు. గాయపడ్డ వారిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఫరక్సానా, విశ్రమ్ బాగ్ పోలీస్ స్టేషన్లకు అతి సమీపంలో జరిగిన ఈ దుర్ఘటన పోలీసులకు ఉగ్రవాదులు విసిరిన సవాల్ గానే భావిస్తున్నామని ఘటన స్థలాన్ని సందర్శంచిన సందర్భంగా మహారాష్ట్ర హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్ అభిప్రాయపడ్డారు. కేసు దర్యాప్తును యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కు అప్పగించినట్లు ఆయన వెల్లడించారు.

ఈ పేలుడు ఇండియన్ ముజాహిదీన్ల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో నగరంలోని జర్మన్ బేకరీ పేలుడులో వాడిన పేలుడు పదార్థం లాంటిదే తాజా పేలుడులోనూ వినియోగించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. ఉగ్రవాదులు వాడిన పేలుడు పదార్థం ఆధారంగానే పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు జర్మన్ బేకరీ పేలుడు సమయంలోనూ హల్వాయ్ గణపతి ఆలయం వద్ద బాంబులతో కూడిన ఓ బ్యాగును పోలీసులు కనుగొన్నారు. నాటి పేలుడు ఇండియన్ ముజాహిదీన్ల పనేనని పోలీసులు తేల్చిన సంగతి తెలిసిందే.