Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సభ్య సమాజం ఆధునిక పోకడలు తొక్కే కొద్దీ మనుషులూ ఆలోచనలు అలవాట్లు హద్దుమీరి పోతున్నాయి. వెనకట కొన్ని పనులు పురుషులు మాత్రమే చేస్తే, మరికొన్ని పనులు మహిళలు మాత్రమే చేసేవారు. కానీ రాను రాను పరిస్థితులు ఆలోచనలు మారాయి. మద్యం ఇంతకు ముందు కేవలం పురుషులు మాత్రమే సేవించేవారు. కానీ ఇప్పుడు పురుషులతో సమానంగా పోటీపడుతున్న మహిళా లోకం మద్యం విషయంలో కూడా అదే విధానాన్ని అవలంభిస్తుంది. దీనికి గల కారణాలు ఏవైనా మహిళలు మాత్రం మందు కొట్టడంలో పురుషులకు ఏ మాత్రం తీసిపోరని తెలుస్తుంది. తాజా అధ్యయనం సైతం దీన్ని పరిశోధనాత్మకంగా నిరూపించింది. ఆస్ట్రేలియా లోని న్యూ సౌత్ వేల్స్ యునివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో మద్యం తీసుకొనే విషయంలో లింగ బేధం క్రమంగా తగ్గిపోయినట్లు వెల్లడైంది. భారత్ లో ఇదివరకు మద్యం తాగే అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండాగా ఇప్పుడు మాత్రం ఈ సంఖ్య క్రమంగా పెరిగిపోతోందట. మన దేశంలో 40 శాతం మంది పురుషులు, 3 శాతం మంది స్త్రీలు ఏడాదిలో ఒకసారైనా మద్యం తీసుకుంటున్నట్లు తేలింది.