Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

పిల్లల మెదడు చురుగ్గా ఉండాలంటే.. పోషకపదార్థాలు చాలా అవసరమని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. వాటిని ఎలా పొందాలంటే..? మాంసం, చికెన్, ఆకుకూరల్లో ఇనుము పుష్కలంగా ఉంటుంది. ఇవి మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే సీ ఫుడ్స్‌ తీసుకోవాలి. అయోడైజ్ ఉప్పు పిల్లలకు పెట్టాలి. మీట్, బీన్స్, తృణధాన్యాలను పిల్లలకు అందించడం ద్వారా సరిపడా జింకు అందుతుంది.
విటమిన్ బి 2, బి6, 12 కూడా మెదడును చురుగ్గా ఉంచుతాయి. ఈ పోషకాలు మీట్, పాలు, కోడిగుడ్లు, తృణధాన్యాలు, పప్పుల్లో లభిస్తాయి. అలాగే ఆకుకూరలు, బీన్స్, బఠాణీలు, తృణధాన్యాలు, పప్పుల్లో ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. విటమిన్ ఎ కోసం పాలు, ఆకు కూరలు, క్యారెట్లు పిల్లలకు ఇవ్వాలి.
విటమిన సి, ఒమెగా త్రీ, సిక్స్ వంటివి మెదడు షార్ప్ చేస్తాయి. ఇవి సిట్రస్ పండ్లు, చేపనూనె, సీ ఫుడ్స్, నట్స్ నుంచి లభిస్తాయి. ఇక ప్రోటీన్స్ కోసం మాంసం, పాలు, కోడిగుడ్లను పిల్లల డైట్‌లో చేర్చితే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.