Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

పిల్లలు బ్రేక్ ఫాస్ట్ వద్దని మారాం చేస్తున్నారా? అయితే జాగ్రత్త అంటున్నారు న్యూట్రీషన్లు. పిల్లలు ముఖ్యంగా అల్పాహారాన్ని వద్దంటే ప్రమాదమేనని వారు సూచిస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్‌గా వట్టి ఫ్రెష్ జ్యూస్‌లను ఇవ్వడం ద్వారా ప్రయోజనం ఉండదు. పండ్ల రసం మాత్రమే పిల్లలు తీసుకుంటే వారి శరీరానికి కావలసిన పోషకాలు అందవని నిపుణులు అంటున్నారు.
స్కూల్స్‌కు హడావుడిగా బయలుదేరేటప్పుడు.. వారిని త్వరగానే నిద్రలేపడం చేయాలి. అప్పుడే ఒత్తిడి లేకుండా పాఠశాలకు వెళ్లడంతో పాటు అల్పాహారాన్ని సక్రమంగా తీసుకోగలుగుతారు.
పిల్లలు అల్పాహారం వద్దని మారాం చేస్తే.. తప్పకుండా వారికి నచ్చజెప్పి బ్రేక్ ఫాస్ట్ తీసుకోమనాలి. పిల్లలకు అల్పాహారంగా కార్న్ ఫ్లెక్స్, బ్రెడ్, శాండ్‌విచ్, ఫ్రూట్స్ వంటి ఇవ్వొచ్చు. వీటితో పాటు ఓ గ్లాస్ ఫ్రెష్ జ్యూస్ ఇవ్వడం ఉత్తమం.
అయితే కోక్ వంటి కూల్‌డ్రింక్స్‌ను మాత్రం ఇవ్వకూడదు. పరగడుపున వీటిని తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.