Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

పిల్లల్ని పెంచటంలో ఇబ్బందిని అధిగమించాలంటే పిల్లలతో ఎక్కువ సమయం గడపండి. పిల్లలు చెప్పే ప్రతి మాటను జాగ్రత్తగా వినండి. పిల్లలు మాట్లాడుతున్నప్పుడు తల్లిదండ్రులు సరిగా వినటం లేదనే అభిప్రాయం కలిగే వారు మాట్లాడటం మానేస్తారు. పిల్లలతో ఎంత ఎక్కువ సమయం వారికి ఉపయోగపడేలా గడపగలిగితే అంత ఆత్మస్థైర్యం వారిలో నింపిన వారవుతారు. పిల్లలతో మాట్లాడేటప్పుడు వారి మాటలు వినేటప్పుడు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడండి. వినటంలో మీరు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు కనిపించాలి.
పిల్లలు ఎలాంటి అంశం మీ ముందుకు తెచ్చినా అంగీకరించండి. వారికి తెలిసే ప్రతి కొత్త విషయం మీ ద్వారానే తెలియటం మంచిది. అది విజ్ఞానశాస్త్రమైనా, లైంగికపరమైన అంశమైనా సరే. పిల్లలకు ఎన్నెన్నో రకాల సందేహాలు కలుగుతుంటాయి. ఆ సందేహాలు తీరకపోతే.. మనసు వాటిమీద నుంచి మరలదు. ఆ సందేహాలు తీరకపోతే.. మనసు వాటిమీద నుంచి మరలదు. వారి సందేహ నివృత్తి చేయడం బిడ్డల సంక్షేమం కోసమేనని గుర్తించుకోండి.
పిల్లల అవసరాలను, ఇబ్బందులను గుర్తించి తీర్చగలిగిన తల్లిదండ్రులు తమ పిల్లల వ్యక్తిత్వ వికాసానికి గట్టి పునాది వేసినట్లు. పిల్లలకు భౌతికపరై సౌకర్యాలను మాత్రమే గుర్తిస్తే సరిపోదు. వారి మానసిక, భావోద్వేగ, సామాజిక, మేధో అంశాలకు సంబంధించిన అవసరాలన్నింటిని గమనించి తీరాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.