Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

నిద్రపుచ్చడంతో పాటు తినిపించడానికి నాన్నమ్మ, తాతయ్యలు కథలు చెబుతుంటారు. పిల్లలకు కథలు చెప్తే ఓపిగ్గా వింటారు. పిల్లలకు ఈ కథల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. పిల్లలకు వీటి ద్వారా కొత్తకొత్త పదాలు పరిచయం చేయవచ్చు. ఏదైనా పదం వింతగా ధ్వనిస్తే, చిన్నారులు దాని అర్థం తెలుసుకునేందుకు ఉత్సుకత చూపుతారు, తద్వారా, ఓ పదం వారికి నేర్పించినట్టువుతుంది. కథల ద్వారా వినగలిగే సామర్థ్యం కూడా మెరుగువుతుంది.
క్లాస్ రూంలో పిల్లలు ఎక్కువగా వినడం కన్నా మాట్లాడడానికే ప్రాధాన్యత ఇస్తారు. అందుకే, వారు మంచి శ్రోతలు కారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కథలు వినడాన్ని గనుక వారు అలవర్చుకుంటే, వారిలో వినడం ద్వారా విషయాలను అర్థం చేసుకునే సామర్థ్యం పెంపొందుతుంది. నేర్చుకునే నైపుణ్యం కూడా ఇతోధికంగా మెరుగవుతుంది.
నేటి కాలంలో టీవీ చానళ్ళు, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ల కారణంగా పిల్లల్లో మానసిక అభివృద్ది కుంటుపడుతోందని, అయితే, కథలు వినడం ద్వారా వారిలో భావోద్వేగాలు, భావనలు అభివృద్ధి చెందుతాయనీ మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు.