Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా హైద్రాబాద్ లో జోరుగా షూటింగ్ జరుపుకుంటుంది. దాసరి మృతి కి సంతాపంగా మూడు రోజుల షూటింగ్ ని ఆపేసాడు పవన్. క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ నటిస్తున్నారు. ఇక వీలైనంత త్వరగా సినిమాలను పూర్తీ చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేసాడు పవన్. లేటెస్ట్ గా మరో క్రేజీ కాంబినేషన్ లో సినిమా చేయడానికి ఓకే చెప్పాడట పవన్. మాస్ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న వివి వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందట !! వినాయక్ తో పవన్ సినిమా అనగానే ఫిలిం వర్గాల్లో ఎక్కువ క్రేజ్ నెలకొంది. ఇప్పటికే కథ చర్చలు జరిగాయని టాక్. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తారట. మాస్ సినిమాల స్పెషలిస్ట్ గా వినాయక్ సినిమాలంటే ఎలా ఉంటాయో అందరికి తెలుసు .. మరి పవన్ తో అయన తీసే సినిమా ఎలా ఉంటుందో అన్నది ఆసక్తి కరంగా మారింది.