Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మొన్నటి వరకు హీరోలను పొగుడుతూ వచ్చిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హఠాత్తుగా పవన్ ఫ్యాన్స్ ను నిందించడం మొదలుపెట్టాడు. ట్విట్టర్ సాక్షిగా ఈ యుద్ధం మొదలైంది. పవన్ ఫ్యాన్స్ టెక్నికల్ గా ఇంకా అభివృద్ధి చెందలేదని.. వారు చదువుకోలేదా అంటూ ప్రశ్నించారు. అసలు ఇలా వర్మ ఎందుకు మాట్లాడాడు అని చూసుకుంటే.. దీనికి కారణం లేకపోలేదు.

పవన్ కళ్యాణ్ కు ట్విట్టర్లో ఆరు లక్షల మంది ఫాలోవర్లు ఉండగా.. మహేష్ బాబుకు 15 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. తాను స్వతహగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని, పవన్ కళ్యాణ్ కు కేవలం ఆరులక్షల మంది మాత్రమే ఫాలోవర్లు ఉండటం బాధాకరమైన విషయమని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అప్ డేట్ అవ్వాలని ఆయన సూచించారు. పవన్ ట్విట్టర్ లో ఆలస్యంగా జాయిన్ అయినా.. టాలీవుడ్ లో బిగ్ స్టార్ కాబట్టి ట్విట్టర్ లో జాయిన్ అయిన వెంటనే లక్షల సంఖ్యలో పవన్ ఫ్యాన్స్ అదే సంఖ్యలో పవన్ ను ఫాలో కావాలి. కాని అలా జరగకపోవడం విచారించదగిన విషయమని అన్నారు.

ఇక, మహేష్ బాబుకు 15 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని, మహేష్ ను అందుకోవడానికి పవన్ కు 2018 వరకు పడుతుందని.. అప్పటివరాక్ మహేష్ కు 45 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారని వర్మ చెప్పుకొచ్చారు. ఇకపోతే, హీరొయిన్ సమంత కు సైతం పదిలక్షల మంది ఫాలోవర్స్ ఉన్నట్టు వర్మ చెప్పారు. ఇక, మహేష్ ఫ్యాన్స్ ను పొగుడుతూ.. పవన్ ఫ్యాన్స్ ను నిరక్షరాస్యులా అని ప్రశ్నించడంతో పవన్ ఫ్యాన్స్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.