Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పార్టీ నిర్మాణంపై ద్రుష్టి సారించినా, పలు సందర్భాల్లో ప్రజా సమస్యలపై స్పదించినా ఇంకా పార్ట్ టైం పొలిటీషియన్ అనే ముద్ర పోలేదు.కొన్ని సామజిక అంశాలపై మాత్రం పవన్ నిరంతరం ట్విట్టర్ ద్వారా స్పందిస్తుంటాడు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే పవన్ ప్రజల్లోకి వెళ్లి సమస్యలని హై లైట్ చేస్తున్నారు. దీనికి కారణం పవన్ ప్రస్తుతం సినీనటుడు కూడా కావడమే. కానీ పవన్ అనుసరిస్తున్న ఈ విధానం అతడిపై విమర్శలకు తావిస్తోంది.

ప్రజా నాయకుండంటే ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ ప్రజలకు వేంటనే అందుబాటులో ఉండాలి. కానీ జనసేనాని ఆ విషయంపై దృష్టి సారించడం లేదు.తన వద్దకు వచ్చిన సమస్యలపై మాత్రమే స్పందించడానికి పవన్ప్రాధానత్య ఇస్తున్నాడని, నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఇటీవల జరిగిన కృష్ణా జిల్లా బస్సు ప్రమాదం సందర్భంగా, ఏర్పేడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం సందర్భంగా పవన్ ప్రజల వద్దకు వెళ్లలేదు. కానీ ఇటీవల హైదరాబాద్ లో ప్రముఖ మీడియా సంస్థ ఆంధ్రజ్యోతి కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించగా పవన్ వెళ్లి పరిశీలించి వచ్చాడు. ఈ అంశం విమర్శలకు తావిస్తోంది. జనసేన పార్టీ ని బలోపేతం చేసే విషయంలో పవన్ ప్రజల కంటే మీడియానే ఎక్కువగా నమ్ముకుంటున్నాడని అంటున్నారు. మరో రెండు ప్రముఖ మీడియ సంస్థలు పవన్ కు అండగా నిలుస్తున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. పవన్ మీడియాతో ఎక్కువగా స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాడని ఇది సరైన విధానం కాదని విమర్శలు వస్తున్నాయి.