Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

చేసింది కొన్ని సినిమాలే అయినా.. వాటితోనే ప్రేక్షకుల విశేష ఆదరనలను పొంది పవర్ స్టార్ గా పేరొంది సామాజిక అవగాహన ఉన్న హీరోగా పేరొందిన వ్యక్తే పవన్ కల్యాణ్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని అధికార, విపక్షాలు, ప్రజలందరు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ విదితమే. అయితే ఈ విషయం పై ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని, ప్రజల తరుపున అండగా నిలబడాలని ఇప్పటివరకు చాలా మంది నేతలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ విదితమే.

అయితే ఇన్ని రోజులు ఈ విషయం పై మౌనం వహించిన పవన్ తిరుపతి, కాకినాడ బహిరంగ సభల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయని మండిపడ్డారు. అయితే ఈ విషయంపై ఒక స్పష్టత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనే ప్రత్యేక ప్యాకేజీ. అయితే ఈ ప్రకటనపై ఏ మాత్రం సంతృప్తి చెందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు వారి నిరసనలను పలు రకాలుగా వెల్లబుచ్చుతున్నారు. అయితే ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే అధికారంలో ఉన్న బాబు,

ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్ కు ఎంత ఇమేజ్ ఉందో వారికి ఏ మాత్రం తీసిపోకుండా పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజల మన్ననలను పొందుతున్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్న నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ అనే చెప్పవచ్చు. పవన్ తిరుపతి సభ విజయవంతం కావడంతో ప్రజల పార్టీల దృష్టి అంతా ఆయన వైపే మళ్లింది. ఏకంగా కేంద్రమే దిగి వచ్చి ప్రత్యేక ప్యాకేజీ ని హడావుడిగా ప్రకటించింది. ఇదంతా పవన్ కళ్యాణ్ పవర్ అనే మీడియా మొత్తం కోడై కూస్తోంది.

అయితే, ఇటీవల పవన్ నిర్వహించిన బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ సీఎం అని కొందరు జనసేన కార్యకర్తలు నినాదాలు చేసిన సందర్భంలో పవన్ ముఖ్యమంత్రి అవ్వడం అనే టాపిక్ పై న్యూస్ ఛానళ్ళు చర్చలు సైతం నిర్వహించాయి. పవన్ కళ్యాణ్ స్వంతంగానో లేక పొత్తు ద్వారా అయిన ఆయనకూ సీఎం అయ్యే అవకాశం వస్తే పవన్ వదులుకుంటారా…? వద్దంటారా….? ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే ఎవరైనా వద్దంటారా…? ఎవరికి మాత్రం ఆ పదవిపై మోజు ఉండదు. అవకాశం రావడమే అదును అందలం ఎక్కాలని భావిస్తున్న నేటి కొత్త తరం రాజకీయ నాయకులు ఎటువంటి అవకాశాన్ని సైతం వదులుకోవడానికి సిద్ధంగా లేరు…!!