Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

లోథా కమిటి సిఫార్సులను అమలుచేయడంలో తాత్సారం చేస్తున్న బీసీసీఐ కు సుప్రీం కోర్టు అల్టిమేటం జారీచేసింది. లొథకమిటీ సిఫార్సులను అమలు చేయాలంటూ సుప్రీం గతం లో సెప్టెంబర్ 30 వరకు బీసీసీఐ కి గడువు ఇచ్చింది.కానీ ఆ గడువు ముగిసినప్పటికీ లోథా కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా బీసీసీఐ నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంతో సుప్రీం కోట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

సమయాన్ని వృధాచేయడం ఆపండి. ఇప్పటికైనా సిఫార్సులు అమలుచేస్తారా లేక మమ్మల్నే ఆదేశాలు జరీ చేయమంటారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. లొథకమిటీ సిఫార్సుల మేరకు బీసీసీఐ లో ఉన్న వారి అర్హతలేమిటో 24 గంటల్లో తెలియజేయాలని లేకపోతె పాలక వర్గాన్ని రద్దుచేసి మధ్యంతర ఎన్నికలకు ఉత్తర్వులు జారీ చేస్తామంటూ ఘాటుగా స్పందించింది. రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు రాత్రికి రాత్రే రూ 400 కోట్లు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించింది.కాగా సుప్రీం విధించిన డెడ్ లైన్ కు బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.