Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పడుకొనే ఈమధ్యనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న స్టార్ గా ఫోర్బ్స్ జాబితాలో కి చేరింది. ఒకసారి ఇంటర్వ్యూ లో మీరు దేనిపై ఆలోచించకుండా ఎక్కువ ఖర్చు పెడతారు అని అడిగిన ప్రశ్నకు దీపిక టక్కున నాకు సొంత ఇల్లు అన్నా ఇంటీరియర్ డిజైన్ అన్నా చాల ఇష్టం దానికోసం ఎంతైనా ఖర్చు పెడతాను అని చెప్పింది.

అలా చెప్పడం కాదు ఇప్పుడు ఏకంగా చేసి చూపించింది. ‘బో మోంద్’ అనే అపార్ట్ మెంట్ లో ఒక ఇల్లు తీసుకుంది. ఈ అపార్ట్మెంట్లో ఏకంగా 33 అంతస్తులు మూడు టవర్లు ఉన్నాయి. ముంబయిలోనే అత్యంత ఖరీదైన ఫ్లాట్లు అవే. విశేషం ఏంటంటే.. దీపిక ప్రియడు రణవీర్ సింగ్ కూడా ఈ మద్యనే ఈమె పక్కనే ఒక అపార్ట్ మెంట్ తీసుకున్నాడు అని ముంబాయ్ మీడియా చెబుతోంది. రణవీర్ కూడా వరస హిట్లుతో 16 బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉంటూ బాగానే సంపాదిస్తున్నాడు. ఇద్దరు సినిమాలు షూటింగ్లు మీటింగుల్లో బిజీగా ఉండటం తో కలుసుకోవడానికి టైమ్ ఉండటం లేదని.. పక్క పక్క ఇల్లు తీసుకున్నారు అని టాక్.