Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రవాస భారతీయ జనతా పార్టీ మరియు మిత్ర సంఘం ప్రవాస విద్యార్ది పరిషత్ యూనిట్ ఆద్వర్యం లో న్యూ జెర్సీ లో జరిగిన విమోచన ధినోత్సవ వేడుకల విందు సమావేశం లో
ప్రవాస తెలంగాణా వారు పెద్ద  సంఖ్యలో పాల్గొన్నారు .
ఈ సందర్భముగా వక్తలు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పరిపాలనలో ఎన్నో సంవత్సరాల పాటు రజాకారుల బల వంతపు వసూళ్లు , హింస ఆగడాలు ,అత్యాచారాలు బానిసత్వం నుంచి సర్దార్ పటేల్ వారి సమర్ధ నాయకత్వం లో నియంత నిజాం మెడలు వంచి భారత దేశం లోకి తిరిగి హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసి తెలంగాణా ప్రజల కు స్వేచ్చ ,స్వాతంత్రం వచ్చిన రోజే Sept 17th విమోచన దినం పండుగ అన్నారు.ఈ సంవత్సరం తెలంగాణా కొత్త రాష్ట్రము ఏర్పడి ఎంతో సంతోషంగా ఒక రాష్ట్ర స్వతంత్ర పండుగ లాగ చేయాల్చిన విమోచన ధినోత్సవం వేడుకలను అధికార లాంచనాలతో రాష్ట్ర పండుగ గా జరుపక పోవడం ఎంతో విచారకరం అన్నారు.దురదృష్టవశాత్తు కొందరి ప్రాపకం కోసం ,ఓట్ల కోసం ప్రస్తుత ప్రభుత్వం అప్పటి నిజాం ను కీర్తిస్తూ వారి పాలనను పొగుడుతూ తెలంగాణా ప్రజల్లో విమోచన దినం స్పూర్తి నిపలుచన చేసే కార్యక్రమం చేయడం ఎంతో అసహజం మరియు అవమానం అన్నారు .

తెలంగాణ ప్రజల్లో మరల భారత దేశ విచ్చిన్న శక్తులను ప్రోత్సహించి వారి దేశభక్తిని పలుచన చేసే ప్రయత్నాలు తిప్పికొట్టి మరియు ఆ నాయకులకు తెలంగాణ ప్రజలు త్వరలో గుణపాటం చెపుతారు అని అన్నారు . తెలంగాణ ప్రజలు భారత సౌభాగ్యం కోసం భారత దేశ ఐక్యతకు ఎప్పుడూ కృషి చేస్తారని వారిని ఏ నాయకులు ఎక్కువ కాలం మోసపుచ్చ లేరన్నారు . ఈ కార్యక్రమం లో ప్రవాస తెలుగు వారు విలాస్ రెడ్డి , అరుణ్ అయ్యగారి , నరేష్ , సంతోష్ , శ్రీకాంత్ రెడ్డి , రఘువీర్ రెడ్డి, విజయ్ కుందూరు , మహేష్ , రామ్ రెడ్డి , శ్రీనివాస్ గానగొని , మేకల సతీష్ , వెంకట్ , శ్రీధర్ , చిత్ర , రమ్య , జ్యోతి , శిరీష మరియు మీడియా మిత్రులు 6TV & TV5 తదితరులు పాల్గొన్నారు .