Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

* ప్రస్తుతానికి తాను గ్లామర్ పాత్రలే పోషిస్తానని చెబుతోంది హన్సిక. “ప్రేక్షకులు నన్ను ప్రెట్టీ డాల్ గానే చూడాలనుకుంటున్నారు. బరువైన పాత్రల్లో నన్ను చూడడానికి ఇష్టపడరు. అందుకే, వాళ్ళు ఎటువంటి పాత్రల్లో చూడాలనుకుంటారో అటువంటివే చేస్తున్నాను” అంటోంది ఈ ముద్దుగుమ్మ.
* నారా రోహిత్, రెజీనా జంటగా నటిస్తున్న ‘శంకర’ సినిమా ఆడియో వేడుక రాత్రి హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఆడియో సీడీలను క్రికెటర్ చాముండేశ్వరీనాథ్ విడుదల చేయగా, తొలిసీడీని హీరో నాని స్వీకరించారు.
* ధర్మ దోనేపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రెండు రెళ్లు నాలుగే’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నూతన నటీనటులు నటించిన ఈ చిత్రం షూటింగ్ మొత్తం అమెరికాలో జరిగింది.
* రజనీకాంత్ నటిస్తున్న ‘లింగా’ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ ఈ నెల 25 నుంచి హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. కె.యస్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్నారు.