Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఆయన శనివారం నుంచి మలేషియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా తీవ్రవాదం, మనుషుల అక్రమరవాణా, తీరప్రాంత భద్రత, దక్షిణ చైనా సముద్రం వివాదం, వాణిజ్యం వంటి అంశాలపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. మూడు రోజుల పాటు సాగనున్న పర్యటనలో ఆయన ఆసియాన్ ‌- భారత్, తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులకు హాజరవుతారు.
అలాగే, మలేసియా ప్రధాని నజిబ్‌రజాక్‌తో ఆయన విస్తృతస్థాయి చర్చలు జరపనున్నారు. తమ ప్రభుత్వం తూర్పు దేశాల పట్ల అనుసరిస్తున్న విధానంలో మలేసియా ప్రధానమైందని మోడీ పునరుద్ఘాటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం జరగనున్న 10వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో తీవ్రవాదంపై ప్రధానంగా చర్చించనున్నారు. మలేసియాలో సుమారు పదివేల మంది భారత సంతతి ప్రజలనుద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు.