Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. సంస్థ కార్మికులు ప్రకటించిన సమ్మె అర్ధరాత్రి నుంచే ప్రారంభమైంది. సుదూర ప్రాంతాల సర్వీసులు అర్ధరాత్రి నుంచే నిలిచిపోగా, మిగిలిన బస్సులు నేటి ఉదయం 6 గంటలకు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 27 వేల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ లు చేపట్టిన సమ్మెకు నేషనల్ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ లు మద్దతు పలికాయి. దీంతో కార్మిక సంఘాలన్నీ సమ్మెకు దిగినట్లైంది. సమ్మె నేపథ్యంలో ప్రయాణం మధ్యలోనే పెద్ద సంఖ్యలో ప్రజలు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. బస్సులు లేని కారణంగా హైదరాబాదు నగరంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.