Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

* ఎల్లప్పుడూ ముఖంలో జీవం తొణికిసలాడుతూ నిత్య యవ్వన్నంగా కనిపించాలంటే.. ముఖ వ్యాయామం (ఫేస్ ఎక్సర్‌సైజ్) ఎంతో ముఖ్యం. ఇందుకోసం ముందుగా సౌకర్యంగా ఉన్న ప్రదేశంలో నిటారుగా కూర్చుని నెమ్మదిగా కళ్ళు మూయాలి. ఆ తర్వాత ఎంత కింద వరకూ చూడగలమో అంతవరకూ మీ క్రిందకు చూడాలి. అలాగే మీరు ఎంత పైకి చూడగలమో అంత వరకూ పైకి చూడాలి.
* నిటారుగా కూర్చుని కనుబొమ్మలు పైకి పెట్టి, చూడగలిగేంత వరకూ కిందకు చూడాలి. ఎక్కువ బలం ఉపయోగించకుండా సౌకర్యంగా ఉండేలా కిందికి చూస్తే సరిపోతుంది. నిటారుగా కూర్చుని రెండు కనుబొమ్మల మధ్య ముడతలు పడేలా దగ్గరకు పెట్టి, ముక్కు వైపుకి అంటే కిందకు తీసుకురావాలి. అలాగే ఉంచి 10 అంకెలు లెక్కపెట్టుకోవాలి, తర్వాత రిలాక్స్‌ కావాలి. ఈ విధంగా కనీసం 5 సార్లు చేయాలి.
*  బెడ్‌‌పై ప్రశాంతంగా వెల్లికిలా పడుకుని సీలింగ్‌ వైపు కళ్ళు తెరిచి పైకి చూస్తూ కనుబొమ్మలను పైకి ఎత్తాలి, ఈ ఎక్స్‌ర్‌సైజ్‌ని  పదిసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే.. నిటారుగా, ప్రశాంతంగా కూర్చుని పెదవులను దగ్గరగా పెట్టి, చెంపల దగ్గర ఉండే మజిల్స్‌తో సహా కదిలేలా ముందుకి పెట్టాలి. ఇదే పొజిషన్‌లో 10 అంకెల వరకూ లెక్క పెట్టి రిలాక్స్‌ అవ్వాలి. కనీసం ఇలా 10 సార్లు చేయాలి. చివరిగా అద్దం ముందు నిలబడి రెండు పెదవులు మూసి ఎంతవరకూ నవ్వగలమో, అంతవరకు నవ్వాలి. అదే పొజిషన్‌లో ఐదంకెలు లెక్కపెట్టి రిలాక్స్ అవ్వాలి.