Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

‘‘ ఐదేళ్ల వయసునుంచే అంగారక గ్రహాన్ని చూడాలనే కోరిక ఉండేది. ఆ కల నా 29యేళ్ల వయసులో తీరబోతుందని తెలియడం ఎంత సంతోషాన్నిస్తుందో మాటల్లో చెప్పడం కష్టం’’ అంటోంది రితికా సింగ్‌. ఢిల్లీ వాస్తవ్యురాలైన ఈమె ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటోంది. రితిక మార్స్‌ ప్రయాణానికి మార్గం ఎలా సుగమం చేసుకుందో ఆమె మాటల్లోనే చదవండి…
మార్స్‌కి నాతో పాటు అపురూపమైన జ్ఞాపకాలను తీసుకెళ్లాలనుకుంటున్నాను. స్టీవ్‌జాబ్స్‌ కనుగొన్న అన్ని ‘ఐ’లను అంటే ఐపాడ్‌ నుంచి ఐఫోన్‌ వరకు అన్నింటినీ నాతో పట్టుకెళ్తాను. అలాగే నాకిష్టమైన పాటలు, ఫోటోలు, పుస్తకాలు… ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలానే ఉంది. వచ్చిన ఇబ్బందల్లా స్పేస్‌షి్‌పలో లగేజి పెట్టుకునే స్థలం ఎంత ఉంటుందనేదే. ఆ విషయం పక్కనపెడితే నన్ను ముందుకు నడిపే ఈ అమూల్యమైన జ్ఞాపకాలను నా వెంటే ఉంచుకోవాలనుకుంటున్నాను నేను.
‘‘ట్రావెలింగ్‌ చేయడమన్నా, కొత్త సంస్కృతులను తెలుసుకోవడమన్నా, కొత్తవాళ్లని కలవడమన్నా నాకెంతో ఇష్టం. మార్స్‌కి వెళ్లే అవకాశం గురించి నా సహోద్యోగి, స్నేహితుడు అయిన నవీన్‌ గోయల్‌ చెప్పాడు. ఆయనే దానికి సంబంధించిన వెబ్‌సైట్‌ లింక్‌ కూడా పంపాడు. అమెరికాలో ఉండే నవీన్‌ స్నేహితుడు ఒకాయన దీనికి సంబంధించిన సమాచారాన్ని నవీన్‌కు పంపాడు. అతను అప్పటికే ఈ సాహసయాత్రకు దరఖాస్తు చేసుకున్నాడు. సాహసయాత్రలతో పాటు నాకు ఫోటోగ్రఫీ, స్విమ్మింగ్‌, అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌, రీడింగ్‌ అంటే కూడా విపరీతమైన ఆసక్తి.
ఎప్పటికీ గుర్తుండిపోయేలా…
మార్స్‌కి వెళ్లే అవకాశం ఉందనే విషయం తెలియగానే మొదట ఆశ్చర్యపోయాను. కొత్త గ్రహంపై అడుగుపెట్టడమనే భావనతో పులకించిపోయాను. ట్రావెలింగ్‌, సాహసయాత్రలు చేయడంపై ఉన్న ఇష్టం మార్స్‌ ప్రయాణం ద్వారా వాస్తవరూపుదాల్చనున్నాయి. మార్స్‌ ప్రయాణానికి ఎంపిక అయ్యేందుకు మేము ఎదుర్కొన్న ఇంటర్వ్యూలు, పరీక్షలు శారీరకంగా, మానసికంగా, భావోద్వేగాల పరంగా మేం ఏ స్థాయిలో ఉన్నామనేది తెలుసుకునే అవకాశం కల్పించింది. అంతేకాదు దీని ద్వారా నేను అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతాను. చరిత్రపుస్తకాల్లో నా పేరు ఎక్కుతుంది కూడా. మార్స్‌కి దరఖాస్తు చేసుకోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహసవ్యక్తుల్ని కలిసే అవకాశం కలిగింది. భిన్న సంస్కృతులు, ఆహారం, భాషలు పరిచయమయ్యాయి.
మార్స్‌కి వెళ్లడం వల్ల నా స్నేహితుల్ని, కుటుంబాన్ని మిస్సవుతాను. కాని అంగారకగ్రహం నాకు కొత్త ఇల్లు కాబోతోంది కదా. జీవితంలో ఒక్కసారి వచ్చే ఈ అనుభవాన్ని ఎలా వదులుకుంటాను. మార్స్‌కు, భూమికి మధ్య సమాచార రవాణా శాటిలైట్స్‌ ద్వారా జరుగుతుంది. భూమికి, అంగారకుడికి మధ్య ఉన్న దూరం వల్ల సమాచార రవాణాలో ఆలస్యం జరుగుతుంది. కమ్యూనికేషన్‌ సిగ్నల్స్‌ కాంతి వేగం బట్టి ప్రయాణిస్తాయి కాబట్టి భూమి నుంచి పంపే సమాచారం అరుణ గ్రహానికి చేరాలన్నా, అటు నుంచి పంపిన సమాచారం ఇక్కడికి రావాలన్నా మూడు నుంచి 22 నిమిషాల సమయం పడుతుంది. అందుకని ఫోన్‌ కాల్‌ అనేది ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు. అదృష్టం కొద్దీ ఇ-మెయిల్స్‌, టెక్ట్సింగ్‌, వాట్సాప్‌ మెసేజ్‌లు పంపుకునేందుకు ఎటువంటి పరిమితులు లేవు. తిరుగు సందేశం అందుకునేందుకు ఆరు నిమిషాల సమయం పడుతుంది. వాయిస్‌ మెయిల్‌, వీడియో మెసేజ్‌లు రెండింటినీ వాడుకోవడం ఎంతో సులువు.
అన్ని ‘ఐ’లు నాతోనే
మార్స్‌కి నాతో పాటు అపురూపమైన జ్ఞాపకాలను తీసుకెళ్లాలనుకుంటున్నాను. స్టీవ్‌జాబ్స్‌ కనుగొన్న అన్ని ‘ఐ’లను అంటే ఐపాడ్‌ నుంచి ఐఫోన్‌ వరకు అన్నింటినీ నాతో పట్టుకెళ్తాను. అలాగే నాకిష్టమైన పాటలు, ఫోటోలు, పుస్తకాలు… ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలానే ఉంది. వచ్చిన ఇబ్బందల్లా స్పేస్‌షి్‌పలో లగేజి పెట్టుకునే స్థలం ఎంత ఉంటుందనేదే. ఆ విషయం పక్కనపెడితే నన్ను ముందుకు నడిపే ఈ అమూల్యమైన జ్ఞాపకాలను నా వెంటే ఉంచుకోవాలనుకుంటున్నాను నేను.
ఇకపోతే మార్స్‌ మీద అడుగుపెట్టాక పరిస్థితి ఎలా ఉంటుంది? ఏం తింటాం? ఎలా ఉంటాం? అనే బెంగే లేదు నాకు. ఎందుకంటే ఇప్పటికే మార్స్‌ మీద వ్యోమగాములు ఉంటున్నారు. కాబట్టి సాంకేతికంగా, సాధారణంగా అక్కడ ఉండేందుకు ఎటువంటి సమస్యలు వచ్చినా వాళ్లే చూసుకుంటారులే అన్న ఽధీమా ఉంది. అంతేకాకుండా వాళ్లకోసం భూమి నుంచి నీళ్లు, ఆక్సిజన్‌, ఆహారం పంపడం అనేది కుదరని పని కదా. అవన్నీ అక్కడున్న వాతావరణంలోనే సమకూర్చుకుంటున్నారు. అలాంటప్పుడు నాకెందుకు బెంగ. ఇప్పటికే వ్యోమగాముల వల్ల నెమ్మదిగా చిన్న గ్రామమే ఏర్పడుతోందక్కడ. లభిస్తున్న వనరులు, ఆక్సిజన్‌, నీళ్ల ఆధారంగా ప్రస్తుతానికి కొద్దిమందికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. కాలనీ విస్తరించడానికి సోలార్‌ పానెల్స్‌, కొత్త క్వార్టర్లు, ప్లాస్టిక్‌ కాంపోనెంట్స్‌ అవసమవుతాయి.
ఇంట్లో ఒప్పించడం కష్టమే అయ్యింది కానీ…
ఇప్పుడు ఇన్ని కబుర్లు చెప్తున్నాను కాని దరఖాస్తు చేసుకునేముందు ఇంట్లో వాళ్లని ఒప్పించడం కష్టమే అయ్యింది. దానికోసం నేను దుబాయి నుంచి ఢిల్లీకి వచ్చాను. చెప్పగా చెప్పగా ఒప్పుకున్నారు. వాళ్లు ఒప్పుకునేందుకు బాల్యం నుంచీ అంగారకుడ్ని చేరుకోవాలన్న నా కోరిక కూడా ఒక కారణం అయ్యింది. మార్స్‌ ప్రయాణానికి ఎంపిక కావడం నిజంగా ఓ అద్భుతమైన భావన. సెలక్షన్స్‌ కోసం వెళ్లినప్పుడు చాలా నెర్వస్‌ అయ్యాను. ఫలితాలు మరుసటిరోజు ఉదయం తెలుస్తాయనగా అంతకుముందు రోజు రాత్రి కంటి మీద కునుకులేదు. మార్స్‌కు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారనే విషయాన్ని ఒక నిమిషం వీడియోలో వివరించాలి. ఇది మొదటి రౌండ్‌. ఆ తరువాత వాళ్లు ఎంపికచేసుకున్న వెయ్యిమందిని వైద్యపరీక్షలకు పంపితే 705 మంది మిగిలారు. తరువాత మరో 45 మందిని తీసేశారు. 660 మంది అభ్యర్థులు మిగిలితే అందరికీ ఒక్కొక్కరికీ పావుగంట చొప్పున ఇంటర్వ్యూ నిర్వహించారు. మార్స్‌ చరిత్ర, మార్స్‌ వన్‌ ఆర్గనైజేషన్‌ గురించి మూడు సాంకేతిక ప్రశ్నలు అడిగారు. అలాగే మూడు సాధారణ ప్రశ్నలు అడిగారు. అలా పలుస్థాయిల్లో ఇంటర్వ్యూలు చేయగా చివరకు 100 మందిమి మిగిలాం.
మార్స్‌ ప్రయాణానికి ఎంపిక అవ్వడం వరకు ఒక దశ అయితే పదేళ్ల ప్రోగ్రామ్‌కి ఎంపికయ్యే 24 మందిలో ఉండాలనుకోవడం మరో దశ. ఈ జర్నీలో నేను తప్పక ఉండాలనుకుంటున్నాను. అది చాలెంజింగ్‌గా ఉంటుంది. నాకు చాలెంజ్‌లు అంటే చాలా చాలా ఇష్టం. మార్స్‌ వాతావరణానికి తగ్గట్టుగా మమ్మల్ని తయారుచేసేందుకు మాకు కొన్ని టాస్క్‌లు ఇస్తారు. అవెలా ఉండబోతాయో చూడాలనే ఉత్సుకత రోజురోజుకీ పెరిగిపోతోంది నాలో. నేను నమ్మే సిద్ధాంతం ‘సస్పెన్స్‌ను ఎంజాయ్‌ చెయ్యి. ఎదురైన ఫలితాన్ని స్వీకరించు.’ ఎందుకంటే చాలాసార్లు మన జీవితాల్లో ఊహించని అంశాలు ఎదురై జీవిత గమనాన్నే మార్చేస్తాయి.’’