Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

బీరకాయను చెక్కు తీసి ముక్కలుగా కోయాలి. వాటిని బాగా ఎండబెట్టి, పొడి చేసుకోవాలి. ఈ పొడిని కొబ్బరి నూనెలో కలిపి మరిగించి తలకు పట్టించాలి. అరగంట పాటు అలాగే ఉంచి తర్వాత కుంకుడు రసంతో తలంటుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తూ ఉంటే… నెరిసిన జుత్తు మెల్లమెల్లగా నల్లబడుతుంది.  ఓ కప్పు హెన్నా పొడిలో రెండు చెంచాల కాఫీ పొడి, చెంచాడు నిమ్మరసం, చెంచాడు పుదీనా పొడి, అర చెంచాడు వెనిగర్, పెరుగు వేసి చిక్కగా కలపాలి. దీన్ని తలకు పట్టించి, గంట తర్వాత శుభ్రంగా తలంటుకోవాలి. జుత్తు నెరిసి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ చిట్కాను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

గుప్పెడు నువ్వుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయమే లేచి మెత్తగా రుబ్బాలి. దీనిలో కాసింత పెరుగు కానీ ఎగ్ వైట్ కానీ కలిపి మాడుకు, జుత్తుకు పట్టించి… అరగంట తర్వాత తలంటుకోవాలి. తరచూ ఇలా చేస్తుంటే తెల్ల జుత్తు నల్లబడటంతో పాటు కుదుళ్లు బలపడి జుత్తు పొడవుగా పెరుగుతుంది.