Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మాజీ నక్సలైట్ నయీమ్ కేసు మరో సారి తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. నయీమ్ తో సంబంధాలు ఉన్నాయంటూ కొంతమంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే అందులో సస్పెండ్ అయిన ఒక ఆఫీసర్ ప్రస్తుత ప్రభుత్వ తీరును తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నయీమ్ చాలా గొప్పవాడని, అతను ఇంతకుముందు పోలీసులకు ఎన్నో విధాలుగా సహాయపడ్డాడు. ఉగ్ర ముఖాలను కూడా పట్టించి దేశానికి ఎంతో మేలు చేశాడని సస్పెండ్ అయిన అధికారులలో ఒకరు తెలిపారు. అంతే కాకుండా నయీమ్ పేరు చెప్పుకొని ఉన్నత పదవులు పొందిన ప్రస్తుత ఐపీఎస్‌లను కూడా విచారించాలని డిమాండ్‌ చేశారు. అలాగే రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ తో పాటు ఆయుధాలు పట్టించిన కేసులను కూడా తిరగేయాల్సి వస్తుందన్నారు.
ప్రస్తుతం సస్పెండ్ కు గురైన ఓ అధికారి నయీమ్ దేశభక్తుడని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం ఈ తరహా వాదనను కొట్టి పారేస్తున్నారు. పోలీసులు కూడా నయీమ్ దేశ ద్రోహి అనడానికి సాక్ష్యాలు ఉన్నాయంటూన్నారు. అలాగే అతనితో సంబంధం ఉన్న 16 మందికి సంబంధించి ఉన్న ఆధారాల ప్రకారం చార్జిమోమోలు జారీచేసినట్టు తెలిపారు. వీరందరితోను తప్పకుండ విచారణ జరుపుతామని కూడా చెబుతున్నారు. అలాగే ప్రస్తుతం మరో నలుగురిపైన నిఘా పెట్టినట్లు తెలుపుతూ.. వారిని కూడా త్వరలోనే విచారిస్తామని పోలీసులు తెలిపారు.