Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ పై మరో మాజీ కెప్టెన్ చేసిన సంచలన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.భారత క్రికెట్ చరిత్రలో గంగూలీ, ధోని ఇద్దరూ అద్భుతమైన కెప్టెన్లే. వారి కెప్టెన్సీ లో టీం ఇండియా అనేక చిరస్మరణీయ విజయాలు సాధించింది.గంగూలీ క్రికెట్ కు గుడ్ యాభై చెప్పి చాలా కాలం అయింది. ధోని కెప్టెన్సీని వదులుకున్నా ఆటగాడిగా జట్టులో కొనసాగుతున్నాడు.

కాగా గంగూలీ ధోని ఆట తీరుపై చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. టి 20 ల్లో ధోని అన్ ఫిట్ అని గంగూలీ వ్యాఖ్యానించాడు.చాలాకాలంగా ధోని టి 20లో ఏమంత గొప్పగా ఆడడం లేదని పేర్కొన్నాడు.”ధోని టి 20 లలో మెరుగైన ఆటగాడు అని నేను అనుకోవడం లేదు. వన్డేల్లో అతడు ఛాంపియనే.. కానీ గత పదేళ్లలో టి 20 లలో అతడు కేవలం ఒక్క అర్థ సెంచరీని మాత్రమే సాధించాడు.ఇది గొప్ప రికార్డు కాదు” అని గంగూలీ అభిప్రాయ పడ్డాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో ఆడిన మూడు మ్యాచ్ లలో ధోని విఫలం కావడంతో గంగూలీ ఈ వ్యాఖ్యలు చేసాడు.